భార్య లేని సమయంలో: కూతురిపై రెండేళ్లుగా తండ్రి పైశాచికం, గర్భం దాల్చిన బాలిక

Siva Kodati |  
Published : Mar 15, 2020, 08:59 PM IST
భార్య లేని సమయంలో: కూతురిపై రెండేళ్లుగా తండ్రి పైశాచికం, గర్భం దాల్చిన బాలిక

సారాంశం

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడు. 

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కి చెందిన ఓ వ్యక్తి 13 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని నవగమ్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు.

Also Read:కామాంధుడైన కన్నతండ్రి.. కూతుళ్లపై లైంకికదాడి.. అది తట్టుకోలేక..

అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం  చేసుకున్నాడు. అప్పటికే ఆమె పెళ్లయి భర్త నుంచి విడిపోయి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలో ఆమె పెరిగి పెద్దదవుతుండటంతో అతని కన్ను బాలికపై పడింది.

ఇంట్లో భార్య లేని సమయంలో సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడేవాడు. రెండేళ్లుగా లైంగిక చర్యకు పాల్పడుతుండటంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే కొద్దిరోజులుగా బిడ్డ ప్రవర్తనలో మార్పు వస్తుండటంతో పాటు బాగా నీరసంగా ఉండటం గమనించిన తల్లి.. కుమార్తెను ఆస్పత్రికి తరలించింది.

Also Read: కన్నకూతురిపైనే అత్యాచారం: తండ్రికి పదేళ్లు జైలు శిక్ష

అక్కడి వైద్యులు బాలికను పరీక్షించగా దిగ్భ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఆమె నాలుగు నెలల గర్భవతి అని చెప్పడంతో ఆ తల్లి షాక్‌కు గురైంది. కూతురిని గట్టిగా నిలదీయడంతో బాలిక జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?