బీహార్ లో ఎంఐఎం బోణీ

By Nagaraju penumalaFirst Published Oct 24, 2019, 2:23 PM IST
Highlights

 కిషన్ గంజ్ లో సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్వీటి సింగ్ పై ఘన విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి ఖమ్రూల్ హోడా గెలుపొంది ఎంఐఎం ఉనికిని చాటుకున్నారు. 

బీహార్: బీహార్ ఉపఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. కిషన్‌గంజ్‌​ ఉప ఎన్నికలో మజ్లిస్‌ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కిషన్ గంజ్ లో సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్వీటి సింగ్ పై ఘన విజయం సాధించారు. 

ఎంఐఎం అభ్యర్థి ఖమ్రూల్ హోడా గెలుపొంది ఎంఐఎం ఉనికిని చాటుకున్నారు. ఇకపోతే బీహార్ లో ఇప్పటి వరకు బీహార్ రాష్ట్రంలో బోణీ కొట్టలేదు. బీహార్ లో ఐదు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగాయి. 

ఐదుస్థానాల్లో ఒకచోట ఎంఐఎం విజయం సాధించి బోణీ కొట్టింది. సిమ్రి భక్తియార్పూర్ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి అరుణ్ కుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాథ్ నగర్‌లో కూడా జేడీయూ అభ్యర్థి లక్ష్మికాంత్ ఆధిక్యంలో ఉన్నారు. 

బెల్హార్‌లో ఆర్జేడీ అభ్యర్థి రాండియో యాదవ్ ముందంజలో ఉన్నారు.శరౌంధలో స్వతంత్ర అభ్యర్థి పోటీచేసిన కరణ్‌జీత్ సింగ్ అలియాస్ వ్యాస్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కిషన్‌గంజ్‌లో  ఎంఐఎం అభ్యర్థి ఖమ్రూల్ హోడాపై, సమస్తిపూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మేనల్లుడు ప్రిన్స్‌రాజ్ ముందంజలో ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

Maharashtra Election Results 2019: కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి అసదుద్దీన్ 'మహా' దెబ్బ

కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ఎవరంటే
 

click me!