కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ఎవరంటే...

By Bukka Sumabala  |  First Published Oct 24, 2019, 12:47 PM IST

2014 లోక్ సభ ఎన్నికల్లో హర్యానా జనహిత్ కాంగ్రెస్ కు చెందిన కుల్ దీప్ బిష్నోయిని 31 వేల 847 ఓట్ల తేడాతో ఓడించారు దుష్యంత్ చౌతాలా. దీంతో దేశంలోనే అత్యంత చిన్న వయసులో MP అయిన వ్యక్తిగా రికార్డు సాధించారు.


2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా కింగ్ మేకర్ గా మారారు. దుష్యంత్ చౌతాలా ఎవరు?

దుష్యంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీకి ప్రస్తుత అధ్యక్షుడు. హర్యానాలోని హిసార్ లోక్ సభ నియోజకవర్గం నుండి పదహారో లోక్ సభకు MP గా ఎన్నికయ్యారు. 

Latest Videos

undefined

దుష్యంత్ చౌతాలా హర్యానాలోని హిసార్ జిల్లా దరోలిలో 1988, ఎప్రిల్ 3న జన్మించారు. తల్లిదండ్రులు అజయ్ చౌతాలా, మాజీ మంత్రి, తల్లి నైనా సింగ్ చౌతాలా ఎమ్మెల్యే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాష్ చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా. అంతేకాదు మాజీ ఉపప్రధానమంత్రి చౌదరీ దేవీలాల్ కి మునిమనవడు అవుతారు. 

read more  మహా సీఎంగా ఆదిత్య ఠాక్రే: శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

దుష్యంత్ చౌతాలా హిమాచల్ ప్రదేశ్ సన్వర్ లోని లారెన్స్ స్కూల్ లో, హిసార్ లోని సెంట్ మెరీస్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో BSc పూర్తి చేశారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో LLM లేదా లాలో మాస్టర్స్ కూడా చేశారు. 2017 ఎప్రిల్ 18న
మేఘనా చౌతాలాను వివాహం చేసుకున్నారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో హర్యానా జనహిత్ కాంగ్రెస్ కు చెందిన కుల్ దీప్ బిష్నోయి ని 31 వేల 847 ఓట్ల తేడాతో ఓడించారు దుష్యంత్ చౌతాలా. దీంతో దేశంలోనే అత్యంత చిన్న వయసులో MP అయిన వ్యక్తిగా రికార్డు సాధించారు.

 read more 

టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 

ఈ యువరాజకీయ నేతకు హర్యానా ఎలాంటి భవిష్యత్తును అందించబోతోందో వేచి చూడాలి. 

click me!