Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రదాడి

Published : Apr 04, 2022, 12:05 AM IST
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రదాడి

సారాంశం

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇద్దరు స్థానికేతరులపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన పుల్వామాలోని లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో  తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని జ‌మ్మూలోని ప్ర‌త్యేక‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ధీరజ్ దత్, సురీందర్ సింగ్‌గా గుర్తించారు పోలీసులు.   

Jammu Kashmir: ఉగ్ర‌వాదుల‌ నుండి దేశాన్ని కాపాడటం భద్రతా బలగాలకు కత్తిమీద సాములా మారుతోంది. స‌రిహ‌ద్దులో భ‌ద్ర‌త ద‌ళాలు నిత్యం పహారా కాస్తున్న.. ఎదోక విధంగా సరిహద్దులలోకి టెర్రరిస్టులు చొరబ‌డుతున్నారు. లేదా కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్నారు. భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డాయి. తాజాగా.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కాల్పుల‌కు తెగ‌బడ్డారు.  

జమ్ముకశ్మీర్‌లోని మరోసారి ఉగ్రవాదులు.. స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ పుల్వామాలోని లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛాతికి బుల్లెట్‌ గాయాలైన ఒకర్ని శ్రీనగర్‌లోని SMHS  ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. మరో వ్యక్తి కాలికి బుల్లెట్‌ గాయమైంది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ధీరజ్ దత్, సురీందర్ సింగ్‌గా గుర్తించినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. స్థానిక కోళ్ల ఫారం వాహనం డ్రైవర్‌గా ఒకరు, సహాయకుడిగా మరొకరు పని చేస్తున్నట్లు చెప్పారు.

కాగా, స్థానికేతరులైన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. కాశ్మీర్ లోయలోకి  300 మందికి పైగా ఉగ్రవాదులు చొర‌బ‌డిన‌ట్టు భ‌ద్ర‌తా బలగాలు తెలిపాయి.  వివిధ టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లలో సరిహద్దు వెంబడి వేచి ఉన్నారని భద్రతా దళాలకు ఇన్‌పుట్‌లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా మంది టెర్రరిస్టులు కాశ్మీర్‌కు వ‌చ్చిన‌ట్టు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించడానికి భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ మరియు బిఎస్ఎఫ్ యొక్క ఉన్నత స్థాయి అధికారులందరూ ఎల్‌ఓసికి ప్రత్యేక సందర్శనలు చేస్తూ గ్రౌండ్ జీరోలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?