ఢిల్లీలో వరుస భూకంపాలు: నేడు జమ్మూలో, రిక్టర్‌ స్కేల్‌పై 3.9గా నమోదు

By narsimha lodeFirst Published Jun 9, 2020, 10:25 AM IST
Highlights

 కాశ్మీర్ లో మంగళవారం నాడు ఉదయం తేలికపాటి భూకంపం సంబవించింది.రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. భూకంప కేంద్రం శ్రీనగర్ కు ఈశాన్యంలో 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు  గుర్తించారు.

శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం నాడు ఉదయం తేలికపాటి భూకంపం సంబవించింది.రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. భూకంప కేంద్రం శ్రీనగర్ కు ఈశాన్యంలో 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు  గుర్తించారు.

మంగళవారం నాడు ఉదయం 8.16 గంటలకు భూకంపం వాటిల్లింది.  సోమవారం నాడు హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో భూకంపం సంభవించింది.  గురుగ్రామ్ కు పశ్చిమ- వాయివ్య దిశలో 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఢిల్లీలో కూడ భూమి స్వల్పంగా కంపించింది.

also read:ఒంగోలు సహా పలు దేశంలోని పలు చోట్ల భూకంపం: భయంతో ప్రజల పరుగులు

ఈ నెల 7వ  తేదీన ఉదయం 11గంటల 55 నిమిషాలకు ఢిల్లీలో భూమి కంపించింది. హర్యానాలోని రోహ‌తక్ జిల్లాకు ఆగ్నేయంగా 23 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉంది. భూమి లోపల ఉన్న ఐదు కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనల కేంద్రం ఉందని నేషనల్ సెంంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

ఈ ఏడాది మే 29న హర్యానాలోని  రోహ్ తక్ లో 4.6 , 2.9 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది.దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 7వ తేదీనన స్వల్పంగా భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 

దాదాపుగా నెలన్నర నుండి ఢిల్లీలో వరుసుగా భూమి కంపిస్తుంది. భవిష్యత్తులో ఢిల్లీలో శక్తివంతమైన భూకంపం వాటిల్లే అవకాశం ఉందని ప్రముఖ భూకంప శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

click me!