వలస కార్మికుల మృత్యుఘోష: ఇంటికి బయల్దేరాడు, శ్రామిక్ రైలు టాయిలెట్లో శవంగా తేలాడు

By Sree s  |  First Published May 30, 2020, 10:28 AM IST

తిండి లేక ఆకలితో మరణించిన తల్లిని లేపుతున్న చిన్నారి వీడియో మనందరినీ కలిచివేసింది సంఘటన ఇంకా మరువక ముందే మరో వలస జీవి శ్రామిక్ రైల్లోనే ప్రాణాలను వదిలాడు. 


తిండి లేక ఆకలితో మరణించిన తల్లిని లేపుతున్న చిన్నారి వీడియో మనందరినీ కలిచివేసింది సంఘటన ఇంకా మరువక ముందే మరో వలస జీవి శ్రామిక్ రైల్లోనే ప్రాణాలను వదిలాడు. దాదాపుగా 5 రోజుల తరువాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

వివారాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లాకు చెందిన మోహన్ లాల శర్మ అనే 38 సంవత్సరాల వయసుగల వ్యక్తి ముంబైలో వలసకూలీగా జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల అక్కడే చిక్కుబడిపోయిన అతడు శ్రామిక ప్రత్యేక రైల్లో ఝాన్సీకి చేరుకున్నాడు. అక్కడి నుండి అధికారులు వలసకూలీలను వారివారి గమ్యస్థానాలకు వెళ్లే వేరే రైళ్లలో ఎక్కించారు. 

Latest Videos

అలా ఝాన్సీ చేరుకున్న సదరు వ్యక్తి తన బంధువుకి ఫోన్ చేసి, తనను గోరఖ్ పూర్ స్టేషన్ లో కలుసుకోవాలని చెప్పాడు. ఆ తరువాత గోరఖ్ పూర్  వెళ్లే రైలు ఎక్కాడు మోహన్. అక్కడ వలస కార్మికులను దింపేసి రైలు తిరిగి ఝాన్సీ చేరుకుంది. అక్కడ రైలును శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బంది టాయిలెట్లో మోహన్ శవాన్ని చూసి అవాక్కయ్యారు. 

మే 23 వ తేదీన రైలు ఎక్కిన మోహన్ 24వ తేదీన గోరఖ్ పూర్ లో దిగలేదు తిరిగి 27వ తేదీన రైలులో శవాన్ని కనుగొన్నారు. అంటే దాదాపుగా నాలుగు రోజుల తరువాత శవం బయటపడింది. 

రైలులోని మిగిలిన వారెవ్వరూ కూడా మోహన్ ని గమనించలేదు. అందరూ కూడా ఇంటికి వెళ్లాలన్న సంతోషంలో ఉండేసరికి ఎవ్వరు కూడా మోహన్ కి ఏమైందని పట్టించుకోలేదు. అతడికి ముంబైలో థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే రైలు ఎక్కించామని అధికారులు అంటున్నారు. శర్మ శవానికి కరోనా పరీక్షలు చేసిన తరువాత శవాన్ని వారి కుటుంబసభ్యులకు అందజేశారు. 

click me!