మోదీ ప్రధాని అవుతారని చెప్పిన జోతిష్యుడు బెజన్ కన్నుమూత

By telugu news team  |  First Published May 30, 2020, 10:26 AM IST

నరేంద్ర మోదీ కూడా ప్రధాని అవుతారని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీకి ప్రమాదం, భోపాల్ విషాదం వంటి ఘటనలను ఆయన ముందుగానే ఊహించి చెప్పారు. 


ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువల్లా(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియా, బ్రెన్ హైపోక్సియా(మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం) వంటి సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన.. గాంధీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 

అయితే.. ఆయన కరోనా వైరస్ సోకి చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన కరోనా బాధితుల లిస్ట్‌లో ఆయన పేరు ఉందని కొందరు అంటున్నారు. అయితే ఆ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు.

Latest Videos

undefined

జూలై 11, 1931లో జన్మించిన బెజన్.. వేదిక్, న్యూమరాలిజీ, పాల్‌మిస్ట్రీ, టరోట్ వంటి జ్యోతిష్యాల్లోను పేరు గడించారు. గణేష్‌ స్పీక్స్‌ పేరుతో ఆయన ఓ జ్యోతిష్య వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. వాజ్‌పేయి, మొర్జారీ దేశాయ్‌ ప్రధానులు అవుతారంటూ బెజన్‌ ముందుగానే చెప్పారు. 

అలాగే నరేంద్ర మోదీ కూడా ప్రధాని అవుతారని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీకి ప్రమాదం, భోపాల్ విషాదం వంటి ఘటనలను ఆయన ముందుగానే ఊహించి చెప్పారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన ఓ వీడియోలో గణేషుడి ఆశీస్సులతో మే 21 తరువాత దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందని బెజన్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. బెజన్ దరువలా మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

click me!