అంధత్వాన్ని జయించి... రూ.47 లక్షల జీతంతో...!

By telugu news teamFirst Published Aug 31, 2022, 10:11 AM IST
Highlights

అతనికి కంటి చూపు లేకపోయినా సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాడు. అది కూడా సంవత్సరానికి రూ.47లక్షల ప్యాకేజ్ తో సాధించడం గమనార్హం. అతనే  మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యశ్ సోనాకియా(25).

శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా మనలో చాలా మంది జీవితంలో ఏమి సాధించలేకపోతున్నారు. కానీ.. నిజానికి మనకు పట్టుదల ఉంటే.. శరీరంలో లోపం ఉన్నా కూడా మనం అనుకన్నది సాధించవచ్చని ఓ యువకుడు నేర్పించాడు. అతనికి కంటి చూపు లేకపోయినా సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాడు. అది కూడా సంవత్సరానికి రూ.47లక్షల ప్యాకేజ్ తో సాధించడం గమనార్హం. అతనే  మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యశ్ సోనాకియా(25).

యశ్.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కి చెందిన వాడు. అతని తండ్రి యశ్ పాల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. యశ్ కి పుట్టుకతోనే గ్లకోమా ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యాధి కారణంగా అతనికి కంటి చూపు నామమాత్రంగానే ఉండేది. అతనికి ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి కంటిచూపు పూర్తిగా పోయింది.

అయితే.. తన లక్ష్యానికి కంటిచూపు లేకపోవడం అడ్డుగా నిలవకూడదు అనుకున్నాడు. చిన్నతనం నుంచే అతనికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాలనే పట్టుదల చాలా ఎక్కువగా ఉండేది. అందుకే చాలా కష్టపడి చదివాడు. గత ఏడాది బీటెక్ పూర్తి చేసిన యశ్.. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సాధించాడు. ఆ సంస్థ అతనికి రూ.47లక్షల ప్యాకేజీ ఆఫర్ చేయడం విశేషం. కొంత కాలం పాటు అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనున్నాడు. ఆ తర్వాత.. బెంగళూరులోని కంపెనీ కి వెళ్లి అక్కడి నుంచి విధులకు హాజరవ్వనున్నాడు.

click me!