
గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించిన అన్ని కేసులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కాలం గడిచే కొద్దీ కేసులు నిరుపయోగంగా మారాయని పేర్కొంది. గుజరాత్‌లోని నరోడా గ్రామంలో 9 కేసుల్లో 8 కేసుల విచారణ ముగియగా, ఒక కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. తొమ్మిది కేసుల్లో ఎనిమిది కేసుల విచారణ ముగిసిందని, నరోదా గావ్‌లోని ట్రయల్ కోర్టులో తుది వాదనలు జరుగుతున్నాయని పేర్కొంటూ.. సీజేఐ యూయూ లలిత్, ఎస్‌ఆర్ భట్, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ఆ కేసులను నిరుపయోగమైనవిగా తేల్చింది.
మణిపూర్ లోనూ బీజేపీతో జేడీ(యూ) తెగదింపులు ? బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఎఫెక్ట్ ?
‘‘ అన్ని విషయాలు ఇప్పుడు పనికిరానివిగా మారినందున ఈ కోర్టు ఈ పిటిషన్లను ఇకపై విచారించాల్సిన అవసరం లేదని ఈ కోర్టు అభిప్రాయపడింది.” అని కోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది. నరోదా గావ్‌లో పెండింగ్‌లో ఉన్న విచారణను చట్టానికి అనుగుణంగా ముగించాలని కూడా ఆదేశించింది. ఈ కోర్టు నియమించిన SIT ఖచ్చితంగా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునే అర్హత కలిగి ఉంటుందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గోద్రా అనంతర అల్లర్లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) దాఖలు చేసిన పిటిషన్‌లలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక విషయంలో మాత్రమే విచారణ పెండింగ్‌లో ఉందని, మిగతా అన్ని అంశాలు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో అప్పీలు దశలో ఉన్నాయని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలియజేశారు. న్యాయవాది అపర్ణా భట్ కూడా ఇప్పుడు కేసుల్లో తేల్చడానికి ఏమీ మిగలలేదని చెప్పారు. అయితే తీస్తా సెతల్వాద్‌కు చెందిన ఎన్‌జీవో రక్షణ కోరుతూ కేసుల దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ముందు దరఖాస్తును పెండింగ్‌లో ఉంచిందని భట్ తెలిపారు.
జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయాలు షురూ.. రాయ్‌పూర్‌కు వెళ్లిన యూపీఏ ఎమ్మెల్యేలు..
2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రాలో ఒక రైలును దుండగులు తగులబెట్టారు. రైలు బోగీలో ఉన్న 59 మంది సజీవదహనమయ్యారు. ఇందులో ఎక్కువగా అయోధ్య నుండి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించింది. ఇది కేవలం ప్రమాదం అని అది తేల్చింది. ఈ నివేదిక సంచలనం సృష్టించింది. ఈ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించబడింది. 2002 ఫిబ్రవరి 28న ఈ కేసులో 71 మంది అల్లరిమూకలను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిపై తీవ్రవాద నిరోధక ఆర్డినెన్స్ (పోటా) ప్రయోగించారు. ఆ తర్వాత 2002 మార్చి 25న నిందితులందరిపై పోటాను ఉపసంహరించుకున్నారు.
భారత నావికాదళానికి కొత్త జెండా.. కొచ్చిలో ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
2005 జనవరి 17వ తేదీన UC బెనర్జీ కమిటీ తన ప్రాథమిక నివేదికలో గోద్రా ఘటన కేవలం ‘ప్రమాదం’ మాత్రమేనని పేర్కొంది. ఆ తర్వాత 13 అక్టోబర్ 2006న నానావతి-షా కమిషన్ అల్లర్లకు సంబంధించిన అన్ని కేసులను ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నందున.. UC బెనర్జీ కమిటీ చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని గుజరాత్ హైకోర్టు ప్రకటించింది. అదే సమయంలో 2008 మార్చి 26న గోద్రా ఘటన, తదనంతర అల్లర్లకు సంబంధించిన 8 కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 18 సెప్టెంబర్ 2008న నానావతి కమిషన్ గోద్రా ఘటనపై తన నివేదికను అప్పగించింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని అన్నారు. ఆ తర్వాత 2011 ఫిబ్రవరి 22న ప్రత్యేక కోర్టు గోద్రా ఘటనలో 31 మందిని దోషులుగా నిర్ధారించగా.. మరో 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.