అమెరికాలో నల్ల జాతీయుడి హత్య.. దానికి చోటు లేదన్న సత్యనాదెళ్ల

By telugu news teamFirst Published Jun 2, 2020, 1:27 PM IST
Highlights

నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని  వ్యాఖ్యానించారు.  ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. 
 

ఇటీవల అమెరికాలో ఓ నల్ల జాతీయుడిని అక్కడి పోలీసులు చంపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై అమెరికాలో ఆగ్రజ్వాలలు మిన్నంటుతున్నాయి. నల్ల జాతీయులపై దాడులను ఖండిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై  టెక్‌ దిగ్గజాలు, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.  గూగుల్‌ సీఈవో  సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు.  

 

There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho

— Satya Nadella (@satyanadella)

నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని  వ్యాఖ్యానించారు.  ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. 

ఇప్పటికే  జార్జ్‌ ప్లాయిడ్‌ మృతిపట్ల  సెర్చ్ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌  సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో  ఉన్న వారెవ్వరూ  ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ  స్క్రీన్ షాట్ ను  ఆయన  ట్విటర్‌లో షేర్‌ చేసిన సంగతి  తెలిసిందే. 

click me!