రెండు లక్షలకు చేరువలో భారత్.. 24గంటల్లో ...

Published : Jun 02, 2020, 10:10 AM ISTUpdated : Jun 02, 2020, 11:08 AM IST
రెండు లక్షలకు చేరువలో భారత్.. 24గంటల్లో ...

సారాంశం

మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. ఇప్పటి వరకు దేశంలో 1,98,706 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,598 మంది మరణించారు. 


భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వరసగా రెండు రోజుల పాటు 8వేల పై చిలుకు కేసులు నమోదవ్వగా.. సోమవారం కూడా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం  8,380 కరోనా కేసులు నమోదయితే, ఆదివారం 8,392 కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం 8,171 కేసులు నమోదవ్వడం గమనార్హం.

 మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. ఇప్పటి వరకు దేశంలో 1,98,706 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,598 మంది మరణించారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్ డౌన్ ను కూడా సడలించడంతో కేసుల సంఖ్యా అంతకంతకు పెరుగుతూ ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

ఇప్పటికే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రపంచంలో కరోనా వైరస్ బారినపడ్డ టాప్ 10 దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. తాజాగా 1,98,000 పైచిలుకు కేసులతో టాప్ 10 లో 9వ స్థానంలో ఉన్న భారత్ రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. 

18 లక్షల పైచిలుకు కేసులతో అమెరికా అగ్ర స్థానములో ఉండగా, ఆతరువాత 5 లక్షల పైచిలుకు కేసులతో బ్రెజిల్, నాలుగు లక్షల కేసులతో రష్యా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది  కేంద్ర ప్రభుత్వం. 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు.  అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని  తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu