మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఛార్జీలు

Published : Feb 04, 2021, 01:54 PM ISTUpdated : Feb 04, 2021, 01:59 PM IST
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఛార్జీలు

సారాంశం

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాక గత ఏడాది సెప్టెంబరు నుంచి మళ్లీ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జనవరి చివరి వరకు దాదాపు 44. 96 లక్షల మందికి పైగా ప్రయాణించారు.   

మెట్రో ప్రయాణికులకు చెన్నై మెట్రో రైల్వే లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో ఛార్జీలను తగ్గించింది.  ప్రయాణికుల సంఖ్యను పెంచే దిశగా మెట్రో రైలు చార్జీలను రూ.50కు తగ్గించింది. మెట్రో రైలు సేవలు దేశంలోని పలు ప్రధాన నగరాలలో అందుబాటులో వున్నాయి. 

ఇతర నగరాలతో పోల్చితే చెన్నై మెట్రోరైల్‌ చార్జీలు కాస్త అధికమనే చెప్పవచ్చు. కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా వుండడంతో ప్రభుత్వం మెట్రోరైల్‌ సేవలను పూర్తిగా నిలిపేసింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాక గత ఏడాది సెప్టెంబరు నుంచి మళ్లీ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జనవరి చివరి వరకు దాదాపు 44. 96 లక్షల మందికి పైగా ప్రయాణించారు. 


ఉత్తర చెన్నైలోని వాషర్‌మెన్‌పేట నుంచి వింకోనగర్‌ వరకు చేపట్టనున్న మెట్రో రైల్‌ విస్తరణ పథకాన్ని ఈ నెల 14వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ముందుగానే సీఎంఆర్‌ఎల్‌ ప్రకటించింది. అయితే ఈ పనులు పూర్తి కాకపోవడంతో మెట్రో విస్తరణ వాయిదా పడే అవకాశముంది. దీనిని మళ్లీ ఈ నెలాఖరులో గానీ, లేదా మార్చిలో గానీ ప్రధాని ప్రారంభిస్తారని గవర్నర్‌ కూడా పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం