రైతుల వద్దకు విపక్ష ఎంపీల బృందం: ఘాజీపూర్ వద్దే అడ్డుకొన్న పోలీసులు

By narsimha lodeFirst Published Feb 4, 2021, 12:14 PM IST
Highlights

న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను కలిసేందుకు వెళ్లిన విపక్ష బృందానికి పోలీసులు అడ్డు చెప్పారు.  10 పార్టీలకు చెందిన ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డగించారు. ఘాజీపూర్ దాటి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.

న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను కలిసేందుకు వెళ్లిన విపక్ష బృందానికి పోలీసులు అడ్డు చెప్పారు.  10 పార్టీలకు చెందిన ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డగించారు. ఘాజీపూర్ దాటి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు 10 పార్టీలకు చెందిన విపక్షపార్టీలకు చెందిన బృందం గురువారం నాడు ఘాజీపూర్ కు బయలుదేరింది.ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్, శిరోమణి అకాళీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

also read:ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో హింస: విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ల కొట్టివేసిన సుప్రీం

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను కలిసేందుకు వెళ్లిన విపక్ష బృందానికి పోలీసులు అడ్డు చెప్పారు. 10 పార్టీలకు చెందిన ఎంపీల బృందాన్ని పోలీసులు గురువారం నాడు అడ్డగించారు. ఘాజీపూర్ దాటి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. pic.twitter.com/Oykz3Kwx5M

— Asianetnews Telugu (@AsianetNewsTL)

రైతులను కలిసేందుకు ప్రయత్నించిన ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసుల తీరును ఎంపీలు తప్పుబట్టారు. రోడ్డుపై మేకులు కొట్టడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేయడాన్ని ఎంపీలు పరిశీలించారు.  పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడ ఈ రకమైన పరిస్థితులు లేవని ఎంపీలు మండిపడ్డారు.

ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నిస్తే పార్లమెంట్ లో తమకు అవకాశం కూడ ఇవ్వడం లేదని ఎంపీలు  విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. 
 

click me!