‘‘స్వయంతృప్తి అలవాటుందా..? వారానికి ఎన్నిసార్లు అని అడిగాడు’’

Published : Oct 12, 2018, 02:00 PM IST
‘‘స్వయంతృప్తి అలవాటుందా..? వారానికి ఎన్నిసార్లు అని అడిగాడు’’

సారాంశం

ఇంటర్వ్యూలో అనవసరంగా అతని పురుషాంగం గురించి ప్రస్తావిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించింది. 


దేశంలో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు.. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీడియా ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే నానా పటేకర్‌, వికాస్‌, అలోక్‌ నాథ్‌, సుభాష్‌ ఘాయ్‌, రజత్‌ కపూర్‌ల చీకటి వ్యవహరాలు వెలుగులోకి రాగా.. తాజాగా డైరెక్టర్‌ సాజిద్‌ ఖాన్‌పై బాలీవుడ్‌ నటి సలోని చోప్రా సంచలన ఆరోపణలు చేసింది.

2011లో సాజిద్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సలోని.. అది తన జీవితంలోనే ఓ భయంకరమైన అనుభవంగా అభివర్ణించింది. ఇంటర్వ్యూలోనే ‘స్వయం సంతృప్తి పొందుతావా? వారానికి ఎన్నిసార్లు?’ అనే అసభ్యకర ప్రశ్నలతో సాజిద్‌ తనపట్ల అమానుషంగా ప్రవర్తించాడని తెలిపింది. ఇక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిన తరువాత చుక్కలు చూపించాడని పేర్కొంది. తను డైరెక్టెర్‌ అసిస్టెంట్‌ను మాత్రమేనని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను కాదని చెబుతుండేవాడని, బికీని ఫొటోలు అడిగేవాడని ఆరోపించింది.

నటులు డ్రెస్‌ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్‌ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది. సమయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటపెడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇక సాజిద్‌ఖాన్‌ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ జర్నలిస్టు సైతం ఆరోపించింది.  ఇంటర్వ్యూలో అనవసరంగా అతని పురుషాంగం గురించి ప్రస్తావిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించింది. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే