కుమార్తెతో తల్లి స్వలింగ సంప్కరం

Published : Oct 12, 2018, 11:31 AM IST
కుమార్తెతో తల్లి స్వలింగ సంప్కరం

సారాంశం

ఇప్పటివరకు కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రులు.. బిడ్డలను లైంగికంగా వేధించిన వార్తలను మాత్రమే చదివాం. కానీ ఇది అందుకు పూర్తిగా భిన్నం.

ఓ తల్లి.. కన్నకూతురిని లైంగికంగా వేధించిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇప్పటివరకు కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రులు.. బిడ్డలను లైంగికంగా వేధించిన వార్తలను మాత్రమే చదివాం. కానీ ఇది అందుకు పూర్తిగా భిన్నం. కడుపులో పెట్టుకొని కాచుకోవాల్సిన తల్లే..కూతుర్ని లైంగికంగా వేధించింది. ఆమె చేస్తున్న పని తప్పు చెప్పాల్సిన బామ్మ.. ఆమెను ప్రోత్సహించడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని తేనాంపేటలో ఆ బాలిక తల్లిబామ్మలతో నివసిస్తుండేది. తల్లితో మనస్పర్థలు రావడంతో తండ్రి విడిపోయాడు. కాగా ఆమె తల్లి స్వలింగ సంపర్కం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ బాలికను వేధించసాగింది. దీనిపై ఆ బాలిక తన తండ్రికి చెప్పగా తట్టుకోలేకపోయాడు. పలుమార్లు హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడంతో అతను పోలీస్టేషన్ మెట్లు ఎక్కాడు. అతను తన భార్య, అత్త కలిసి కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాక్ష్యంగా సెల్‌ఫోన్‌లో వీడియో ఆధారాన్ని కూడా పోలీసులకు సమర్పించాడు. పోలీసులు బాలిక తల్లిని పోక్సో చట్టం క్రింద, దీనికి ప్రోత్సహించిన ఆమె బామ్మను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?