భార‌త యూజ‌ర్ల‌కు షాకిచ్చిన మెటా.. ఒక్క‌నెల‌లోనే 71 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. ఎందుకంటే..?

By Mahesh Rajamoni  |  First Published Nov 3, 2023, 5:42 AM IST

WhatsApp: ప్ర‌ముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ కు భారతదేశంలో సుమారు 500 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. అయితే, సెప్టెంబర్ నెలలోనే ప‌లు అంశాల‌కు సంబంధించి 10,442 ఫిర్యాదులను అందుకుంది. కొత్త ఐటీ నిబంధ‌న‌ల క్ర‌మంలో భారీగా సంఖ్య‌లో అకౌంట్ల‌ను బ్యాన్ చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 
 


WhatsApp India: మెటా సంస్థ ఆధీనంలోని  ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ భార‌త యూజ‌ర్ల‌కు భారీ షాకిచ్చింది. ఏకంగా 71 ల‌క్ష‌లకు పైగా ఖాతాల‌ను బ్యాన్ చేసింది. ఇది కూడా ఒక్క‌నెల‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం. తాజా రిపోర్టుల ప్ర‌కారం.. వాట్సాప్ భారతదేశంలో 71 లక్షలకు పైగా బ్యాడ్ ఖాతాలను నిషేధించింది. సెప్టెంబర్ 1-30 మధ్య అమలు చేసిన కొత్త ఐటి రూల్స్-2021 కు అనుగుణంగా  సెప్టెంబర్ (2023) లో ఈ చర్య తీసుకుంది. నిషేధిత ఖాతాల్లో 25,71,000 ఖాతాలను యూజర్ల నుంచి ఎలాంటి నివేదికలు సేకరించకముందే బ్లాక్ చేసినట్లు వాట్సాప్ నెలవారీ కంప్లయన్స్ రిపోర్టులో పేర్కొంది. 

'యాక్షన్' రికార్డ్ ప్ర‌కారం.. 

Latest Videos

ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ కు కు భారతదేశంలో సుమారు 500 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. అయితే, సెప్టెంబర్ నెలలోనే ప‌లు అంశాల‌కు సంబంధించి 10,442 ఫిర్యాదులను అందుకుంది. కొత్త ఐటీ నిబంధ‌న‌ల క్ర‌మంలో భారీగా సంఖ్య‌లో అకౌంట్ల‌ను బ్యాన్ చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

వాట్సాప్ ఖాతాల‌పై చ‌ర్య‌లు.. 

'అకౌంట్స్ యాక్షన్డ్' అనేది నివేదిక ఆధారంగా వాట్సాప్ దిద్దుబాటు చర్యలు తీసుకున్న నివేదికలను సూచిస్తుంది. పునరుద్ధరించబడిన ఖాతాను లేదా గతంలో నిషేధించిన ఖాతాను మ‌ళ్లీ నిషేధించడాన్ని సూచిస్తుంది. ఈ యూజర్ సేఫ్టీ రిపోర్టులో యూజర్లకు అందిన ఫిర్యాదులు, వాట్సాప్ తీసుకున్న చర్యలతో పాటు తమ ప్లాట్ ఫామ్ పై దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సాప్ స్వీయ నివారణ చర్యల వివరాలు ఉన్నాయని వాట్సప్ తెలిపింది. సెప్టెంబర్ (2023)లో దేశంలోని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ నుండి వాట్సాప్ కు సుమారు ఆరు ఆర్డర్లు వచ్చాయనీ, వాటిని పాటించామ‌ని నివేదించారు.

భారతదేశంలోని మిలియన్ల మంది సోషల్ మీడియా వినియోగదారులకు సాధికారత కల్పించడానికి, కంటెంట్, ఇతర సమస్యలకు సంబంధించిన ఆందోళనలను పరిశీలించిన గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (జీఏసీ)ని కేంద్రం ఇటీవల విడుదల చేసింది. దేశంలో డిజిటల్ చట్టాలను బలోపేతం చేయడానికి కొత్తగా ఏర్పాటు చేసిన ప్యానెల్.. బిగ్ టెక్ కంపెనీలతో స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణ ఏర్పాటు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వినియోగదారులు చేసే అప్పీళ్లను ఇది మరింత పరిశీలిస్తుంది. అయితే, దుర్వినియోగాన్ని నివారించడంలో, ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సేవలలో తాము ఈ పరిశ్రమ లీడర్ అని వాట్సాప్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల భ‌ద్ర‌త‌కు, వారి డేటా ర‌క్ష‌ణ కోసం తాము నిరంత‌రం అన్ని చ‌ర్య‌లు తీసుకుటున్నామ‌ని స్ప‌ష్టం చేసింది.

click me!