బస్సుల్లో ‘స్త్రీ’ల సీట్లలో కూర్చుంటే పురుషులకు ఫైన్.. బెస్ట్ నిర్ణయం

Published : Aug 28, 2021, 07:46 PM IST
బస్సుల్లో ‘స్త్రీ’ల సీట్లలో కూర్చుంటే పురుషులకు ఫైన్.. బెస్ట్ నిర్ణయం

సారాంశం

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో బస్సు సేవలందిస్తున్న బెస్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లలో నిబంధనలకు విరుద్ధంగా పురుషులు కూర్చున్నట్లయితే వారికి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.  

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో బస్సు సర్వీసులను అందిస్తున్న బెస్ట్(బృహన్‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్‌పోర్ట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లల్లో పురుషులు కూర్చోకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ‘స్త్రీ’లకు కేటాయించిన సీట్లల్లో కూర్చుంటే వారికి జరిమానా విధించాలని నిర్ణయించింది. రూ. 500 ఫైన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. లేదా పోలీసులు లేదా రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం ఆదేశాల మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశాలు సిద్ధం చేసింది.

అంతేకాదు, స్త్రీల సీట్లలో కూర్చున్న పురుషులను విచారించడానికి బస్సును నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాలనీ కండక్టర్లకు సూచనలు చేసింది. మహారాష్ట్ర మోటార్ వెహికల్ రూల్స్ 102 సెక్షన్ కింద పురుష ప్యాసింజర్లను విచారించాలని తెలిపింది.

చాలా మంది మహిళలు సీట్ల వ్యవహారం గురించి బెస్ట్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకా చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బెస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, ఈ ఆదేశాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని, వాస్తవంలో కార్యరూపం దాల్చడం లేదని బెస్ట్ కమిటీ మెంబర్ సునీల్ గణాచార్య తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?