
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడిపై ప్రత్యర్ధి గ్యాంగ్ సభ్యులు మూత్ర విసర్జన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగి ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా వున్న కఫ్తాన్ సింగ్ గ్యాంగ్‌కు, శివ సింగ్ గ్యాంగ్‌కు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని.. ఈ నేపథ్యంలోనే గత నెల 31న సైతం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని పోలీసులు తేల్చారు. ఆ ఫైటింగ్‌లో కఫ్తాన్ సింగ్ గ్యాంగ్ గెలవడంతో.. శివను చితకబాది అతడి ముఖంపై తన ముఠా సభ్యులతో మూత్ర విసర్జన చేయించాడు. అయితే ఇద్దరు ముఠా నాయకులపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.