ట్రంప్ అమ్మాయిల పిచ్చి.... ప్రేమతో మార్చుకున్న మెలానియా

Published : Feb 25, 2020, 12:08 PM IST
ట్రంప్ అమ్మాయిల పిచ్చి.... ప్రేమతో మార్చుకున్న మెలానియా

సారాంశం

తొలి చూపులోనే ప్రేమలో పడిన వీరి ప్రేమకథ ఎవరినైనా ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. ట్రంప్ తనకి ఉన్న ఓ వీక్ నెస్ ని కేవలం తన అందాల భార్య మెలానియా కోసం వదులుకున్నారట.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబడినప్పటి నుంచి ఆయన ఏది చేసినా ఓ సంచలనమే అయ్యేది. ప్రస్తుతం ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చారు. ఆయనతోపాటు.. ట్రంప్ సతీమణి మెలానియా కూడా వచ్చారు.

వీరిద్దరి మధ్య వయసులో 24ఏళ్ల వ్యత్సాసం ఉందన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంత వయసు తేడా ఉన్నా.. ప్రేమ మమల్ని ఒక్కటి చేసింది అని చెబుతుంటారు. తొలి చూపులోనే ప్రేమలో పడిన వీరి ప్రేమకథ ఎవరినైనా ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. ట్రంప్ తనకి ఉన్న ఓ వీక్ నెస్ ని కేవలం తన అందాల భార్య మెలానియా కోసం వదులుకున్నారట.

Also Read ఆగ్రా పర్యటన... మడ్ ప్యాక్ గురించి అడిగి తెలుసుకున్న మెలానియా ట్రంప్...

ఇంతకీ వారి ప్రేమ కథ ఎలా మొదలైందో ఓసారి మనమూ లుక్కేద్దామా...  మోలానియా స్లోవేనియాలో జన్మించారు. 16వ ఏటే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కలిగిన ఈమె.. ఎంతో కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 1998లో ఓ పార్టీలో ట్రంప్‌కు, మెలానియాకు పరిచయం ఏర్పడింది.

ఆ తొలి పరిచయంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారట. తాము విడివిడిగా ఉండలేము అని నిర్ణయించుకున్నాక.. 2005 లోపెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అయితే.. ట్రంప్ కి కాస్త అమ్మాయిల పిచ్చి ఎక్కువ అనే వార్తలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఆ విషయం మాత్రం మెలానియాకు నచ్చేది కాదట. అయితే... మెలానియా కోసం ఆ విషయంలో  ట్రంప్ మారిపోవడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !