ఢిల్లీ సర్కార్ బడిని సందర్శించనున్న మెలానియా ట్రంప్

Published : Feb 20, 2020, 02:34 PM IST
ఢిల్లీ సర్కార్ బడిని సందర్శించనున్న మెలానియా ట్రంప్

సారాంశం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తన భారత పర్యటనలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించే అవకాశం ఉంది. ట్రంప్ దంపతులు ఈ నెల 24వ తేదీన భారత్ వస్తున్న విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఆమె భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. నిరుడు సెప్టెంబర్ లో హౌస్టన్ లో ఏర్పాటు చేసిన హౌడీ మోడీ తరహాలో అహ్మదాబాద్ లో మోటెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ పేరుతో భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే దాదాపు లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.  

Also Read: ట్రంప్ వస్తున్నాడని.. గోడకట్టేసి, బస్తీవాసులను దాచేస్తున్నారు!

ఆ తర్వాత ట్రంప్ ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం ప్రోటోకాల్ లో భాగంగా రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ నకు స్వాగతం ఉంటుంది. 

Also Read: ట్రంప్ భారత పర్యటన: మినిట్ టూ మినిట్ షెడ్యూల్

సాయంత్రం ట్రంప్ న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో జరిగే భారత కంపెనీల ఎగ్జిక్యూటివ్ లతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ట్రంప్ భారత పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు