మేఘాలయ బొగ్గుగని ప్రమాదం: 36 రోజులకు దొరికిన ఒక మృతదేహం

By sivanagaprasad kodatiFirst Published Jan 17, 2019, 12:14 PM IST
Highlights

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని ఓ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 15 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. గత ఏడాది డిసెంబర్ 13న తూర్పు జయంతియా జిల్లాలోని ఓ అక్రమ బొగ్గుగనిలో బొగ్గును వెలికితీసేందుకు 15 మంది కార్మికులు లోపలికి వెళ్లారు. 

ఈ క్రమంలో గనికి పక్కగా ప్రవహిస్తున్న లిటిల్ నది నీరు గనిలోకి చొచ్చుకురావడంతో వారు అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం, అగ్నిమాపక దళం సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే గనిలో నీరు ఎక్కువగా ఉన్నందున సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇవాళ గాలింపు చర్యలు చేపడుతుండగా దాదాపు 160 అడుగుల లోతులో ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించారు. కార్మికులు గల్లంతై ఇప్పటికే సుమారు నెల రోజులు గడిచిపోవడంతో వారు బతికే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

click me!