ఆస్పత్రిలో చేరిన అమిత్ షా

Published : Jan 17, 2019, 07:34 AM IST
ఆస్పత్రిలో చేరిన అమిత్ షా

సారాంశం

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. స్వైన్ ఫ్లూ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. 

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. స్వైన్ ఫ్లూ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

‘నాకు స్వైన్‌ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి దయ, మీ అందరి ఆశీర్వాందంతో త్వరలోనే కోలుకుంటా’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఛాతీ పట్టేయడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర కారణాలతో అమిత్‌ షాను ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అమిత్‌ షాను ఆసుపత్రిలో పరామర్శించారు.
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?