డీజీపిల నియామకంపై రాష్ట్రాలకు సుప్రీంలో చుక్కెదురు

By pratap reddyFirst Published Jan 16, 2019, 6:52 PM IST
Highlights

రాష్ట్రాల పోలీసు డైరెకర్స్ జనరల్ (డీజీపిల) నియామకంపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కెదురైంది. డీజీపీల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 

న్యూఢిల్లీ: రాష్ట్రాల పోలీసు డైరెకర్స్ జనరల్ (డీజీపిల) నియామకంపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కెదురైంది. డీజీపీల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  డీజీపీలను యూపీపీఎస్సి ద్వారా కాకుండా సొంత కమిటీల  ద్వారా నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

ఆయా రాష్ట్రాల పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. డీజీపీలను రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా నియమించుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. పోలీసు శాఖ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, కాబట్టి దాని అధిపతిని తామే నియమించుకుంటామని రాష్ట్రాలు వాదిస్తూ వచ్చాయి.

ప్రస్తుత కేసులో ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ... డీజీపీల ఎంపికపై సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. 

డీజీపీల ఎంపిక విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశమని,రాజకీయ జోక్యం నుంచి పోలీసు శాఖను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పంజాబా్, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, హర్యానా రాష్ట్రాలు ఆ పిటిషన్ ను దాఖల చేశాయి. 

click me!
Last Updated Jan 16, 2019, 6:52 PM IST
click me!