
నిషాత్ జహాన్ వయసు 36 ఏళ్లు.. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. ప్రస్తుతం ఆమె నిర్మాణ స్థలంలో ఇటుకలను సిమెంట్, ఇసుక మిశ్రమంతో పేర్చి గోడలను నిర్మిస్తున్నారు. అయితే సాంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన నిషాత్ జహాన్ తన గ్రామం నుంచి తోడు లేకుండా బయటకు వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె భర్తకు ఉద్యోగం లేదు. కుటుంబాన్ని పోషించేందుకు డబ్బు సంపాదించడానికి ఆమె కూడా తన గ్రామంలోని ఇతర మహిళల మాదిరిగానే వ్యవసాయ పనులకు వెళ్లేవారు.
అయినప్పటికీ.. ఎక్కువ మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనే తమ కోరికను నొక్కిచెప్పడం మొదలుపెట్టారు. బీహార్, జార్ఖండ్ నుంచి పెద్ద నగరాలలో నిర్మాణ పనులకు నైపుణ్యం కలిగిన మగ కార్మికులు వెళ్లేవారు. అయితే నిషాత్ జహాన్ వంటి మహిళలు తాపీపని కోసం అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునే ధైర్యమైన అడుగు వేశారు.
నిషాత్ జహాన్ నిషేధాలను ఉల్లంఘించి జార్ఖండ్‌లోని 50,000 మంది నైపుణ్యం కలిగిన మహిళా మరుగుదొడ్డి తయారీదారులతో చేరారు నిషాత్ జహాన్ రాంచీలో శిక్షణ పొందారు. ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఈ వారం రోజుల కార్యక్రమంలో ఆమెతో పాటు ఇతర మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణంలో శిక్షణ ఇచ్చారు.
తాజాగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని సిల్బర్ ఖుర్ద్ గ్రామంలో నిషాత్ జహాన్ పని వేగాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆమె సాధారణంగా సూర్యోదయానికి ముందే టాయిలెట్ నాలుగు గోడలను పెంచుతారు. నిషాత్ జహాన్, ఆమె స్నేహితురాలు ఉషా రాణి ఈ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు.
ఇక, నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మహిళలపై ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను ప్రచురించింది. దాని ప్రకారం జార్ఖండ్‌లో నిర్మాణ పనుల కోసం 50,000 మంది మహిళలు మేస్త్రీలుగా శిక్షణ పొందారు. వారిలో నిషాత్ జహాన్ ఒకరు. 40 ఏళ్ల ఊర్మిళా దేవి నిషాత్, ఉష పని చేస్తున్న ప్రదేశానికి కొంచెం దూరంలో ఉన్న రోడ్డు పక్కన దాబా దగ్గర టాయిలెట్ నిర్మాణంలో నిమగ్నమై ఉంది. ఊర్మిళా దేవి ఇప్పటి వరకు 1,000కు పైగా మరుగుదొడ్లను నిర్మించినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. మరుగుదొడ్ల నిర్మాణానికి తాపీ మేస్త్రీగా పని చేసేందుకు ఊర్మిళ బీహార్‌లోని చంపారన్‌కు వెళ్లారు. మరో తాపీ మేస్త్రీ పూనమ్ దేవి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 900 మరుగుదొడ్లను నిర్మించారు.
భారతదేశంలో, బహుశా ప్రపంచవ్యాప్తంగా, తాపీపని తరచుగా పురుషుల పనిగా కనిపిస్తుంది. ఈ రంగంలో పురుషుల నైపుణ్యాలను గౌరవిస్తూ మేస్త్రీలను రాజ్ మిస్త్రీ (కార్మికుల ప్రధానుడు) అని పిలుస్తారు. సాంప్రదాయకంగా భారతదేశంలోని నిర్మాణ ప్రదేశాలలో మహిళలు సహాయకులుగా పనిచేసేవారు. వారు తరచూ మేస్త్రీకి ఇటుకలను మోసుకెళ్లడం, సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని సిద్ధం చేయడం, మేస్త్రీల సూచనలన్నింటినీ పాటించడం వంటివి చేస్తారు.
బీహార్, జార్ఖండ్‌లోని మహిళలు ఈ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. వారికి రాణి మిస్త్రీ (క్వీన్ వర్కర్) అని కొత్త బిరుదు ఇవ్వబడింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించే బృహత్తర కార్యక్రమం కింద ఈ మహిళలు మొదటిసారిగా తాపీపని చేపట్టారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారతదేశం భారీ థ్రస్ట్ కోసం చాలా మంది పురుషులు పెద్ద నగరాలకు వలస వెళ్ళినందున ప్రపంచ బ్యాంకు మహిళలకు సాధికారత కల్పించాలని నిర్ణయించింది.
నిషాత్, రాణి హజారీబాగ్‌లో వారం రోజుల పాటు జరిగే శిక్షణా సమావేశాలకు హాజరై సోక్ పిట్స్ మరియు ట్విన్ పిట్‌ల తయారీలో మెళకువలను నేర్చుకున్నారు. వారం రోజుల తర్వాత సీనియర్ మేస్త్రీల దగ్గర పనిచేసేలా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు జార్ఖండ్‌లోని 50,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన మహిళా మేస్త్రీలు రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చే ప్రచారంలో తమ వంతు కృషి చేశారు.
ఇదిలా ఉంటే.. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రణాళిక, అమలు కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి సాంకేతిక సహాయం పొందిన రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. ఈ సాంకేతిక సహాయంలో భాగంగా ప్రపంచ బ్యాంకు మరుగుదొడ్లు నిర్మించడానికి మేస్త్రీలకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఆ కార్యక్రమాలలో అనేక మహిళా కార్మికులు పాల్గొన్నారు. అయితే మొదట్లో గ్రామాలలోని ప్రజలు, ముఖ్యంగా మహిళలు విముఖత చూపారు.చాలా కుటుంబాలు తమ మహిళలు పనికి వెళ్లడం, పురుషులు చేయవలసిన పనిని చేయడాన్ని వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఈ మహిళలు నిషేధాల నుంచి విముక్తి పొందగలిగారు.
ఇంతకుముందు కూలిపనులు చేస్తున్నప్పుడు ఈ మహిళలు తమ గ్రామం నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. వారు తమ ఇంటి పనులు చేసుకునేవారు లేదా పొలాల్లో కూలీలుగా పనిచేశారు. అయితే రాణి మిస్త్రీలుగా మారిన తర్వాత వారి జీవితమే మారిపోయింది. ఈ మహిళల సంపాదన రోజువారీ వేతనాలు పొందే నైపుణ్యం లేని కార్మికులుగా ఉన్న రోజులతో పోలిస్తే.. రెట్టింపు అయింది.
-మంజిత్ ఠాకూర్