
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ , అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి అన్నదమ్ములిద్దరిని ఒకరోజు ముందే కోర్టులోనే చంపాలని ముగ్గురు నిందితులు స్కెచ్ గీశారు. అయితే ఏప్రిల్ 14వ తేదీని వీరిద్దరిని హాజరుపరచడానికి తీసుకొచ్చిన సమయంలో ప్రయాగ్‌రాజ్ కోర్టు వద్ద భారీగా భద్రత వుండటంతో తమ ప్లాన్‌ను విరమించుకున్నారు నిందితులు లవ్లేష్, సన్నీ, అరుణ్. అయితే ఆ తర్వాతి రోజు రాత్రి ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీ వద్ద భద్రత తక్కువగా వుండటంతో తమ ప్లాన్‌ను సులభంగా అమలు చేయగలిగారు. అతీఖ్ సోదరుల హత్య కోసం ప్రయాగ్‌రాజ్ వచ్చిన నిందితులు ఒక హోటల్‌లో బస చేశారు. అంతేకాదు.. హత్య చేయాలనుకున్న రోజే వీరు ముగ్గురు రెక్కీ సైతం నిర్వహించారు. ఈ మేరకు నిందితుల్లో ఒకరైన సన్నీ పోలీసుల విచారణలో కీలక విషయాలు చెప్పాడు.
రెండేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మాన్ గోగి నుంచి జిగాన పిస్తోల్‌ను తీసుకొన్నట్లు అతన తెలిపాడు. పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని చూసి సన్నీ కూడా ఓ ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. పంజాబ్ యువ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్యకు లారెన్స్ గ్యాంగ్ వినియోగించిన మాదిరే.. అతీఖ్ హంతకులు కూడా జిగాన గన్స్‌ను వాడారు. అంతేకాదు.. హత్య జరిగిన రోజు రాత్రి జర్నలిస్టుల వేషాల్లో వెళ్లేందుకు గాను వీరికి డమ్మీ మైకు, కెమెరాలను గోగి గ్యాంగ్ అందించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ALso Read: అతీక్ అహ్మద్ భార్య పర్వీన్ ఎక్కడ?.. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు..
కాగా.. హత్యకు గురైన గ్యాంగ్ స్టర్- రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై యూపీకి చెందిన ఓ కాంగ్రెస్ నేత త్రివర్ణ పతాకాన్ని పరిచారు. అలాగే ఆయనకు భారత రత్న, అమరవీరుడి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాదిపై జాతీయ జెండా పరిచిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. దీంతో ఆ కాంగ్రెస్ నేతను పోలీసులు అరెస్టు చేశారు.
ఏప్రిల్ 15 రాత్రి పోలీసు కస్టడీలో ఉన్న అతిక్, అతడి తమ్ముడు అష్రఫ్ లను ముగ్గురు సాయుధ దుండగులు కాల్చిచంపారు. మరుసటి రోజు ఏప్రిల్ 16వ తేదీన సాయంత్రం కసరి మసారీ శ్మశానవాటిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఆ సమాధిపై రజ్జూ జాతీయ జెండా పరిచారు. మరో వీడియోలో అతడు అతిక్ అహ్మద్ ను అమరవీరుడు అని పిలుస్తూ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.