కరోనాతో గంటల వ్యవధిలో కవలలు మృతి: కన్నీరుమున్నీరౌతున్న పేరేంట్స్

By narsimha lodeFirst Published May 18, 2021, 11:00 AM IST
Highlights

 ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో కరోనాతో కవలలు మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కి చెందిన గ్రెగరీ రైమండ్ రఫేల్, సోజా దంపతులు నివసిస్తున్నారు. 1997 ఏప్రిల్ 23వ తేదీన  ఈ దంపతులకు కవలలు పుట్టారు.కవలలకు జోఫ్రెడ్ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్ వాగెస్ గ్రెగరీ అని పేర్లు పెట్టుకొన్నారు రైమండ్ దంపతులు. 
 

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో కరోనాతో కవలలు మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కి చెందిన గ్రెగరీ రైమండ్ రఫేల్, సోజా దంపతులు నివసిస్తున్నారు. 1997 ఏప్రిల్ 23వ తేదీన  ఈ దంపతులకు కవలలు పుట్టారు.కవలలకు జోఫ్రెడ్ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్ వాగెస్ గ్రెగరీ అని పేర్లు పెట్టుకొన్నారు రైమండ్ దంపతులు. చిన్నతనం నుండి  పిల్లలిద్దరికి ఒకరంటే మరొకరికి ప్రేమ.ఇద్దరూ కూడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్శిటీ నుండి  పట్టా పొందారు. క్యాంపస్ సెలక్షన్‌లో భాగంగా జోఫ్రెడ్ అసెంచర్ లో ఉద్యోగం వచ్చింది. రాల్‌ప్రెడ్ హుందాయ్ మ్యుబిస్ కంపెనీ హైద్రాబాద్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించాడు. 

ఒకే రకమైన రూపంతో పాటు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండే  ఇద్దరంటే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. కరోనా కారణంగా ఇద్దరికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. దీంతో ఇద్దరూ ఇంటికి చేరుకొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న  ఇద్దరికి జ్వరం వచ్చింది. వైద్యుల సలహాతో వైద్య చికిత్సను తీసుకొన్నారు. అయినా వారిద్దరి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఈ నెల 1వ తేదీన ఆసుపత్రిలో చేరారు.

ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. 10 రోజుల చికిత్స తర్వాత  ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. కానీ మూడు రోజుల తర్వాత  జాఫ్రెడ్‌  మరణించాడు. ఈ విషయాన్ని  రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు పేరేంట్స్ .అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌ అని వాళ్ల అమ్మను అడిగాడు రాల్‌ప్రెడ్.24 గంటల తర్వాత రాల్‌ప్రెడ్ కరోనాతో మరణించాడు. గంటల వ్యవధిలోనే చేతికి వచ్చిన కొడుకులు ఇద్దరూ మరణించడంతో  పేరేంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


 

click me!