నేను టీ షర్ట్‌పై ఉండటం సమస్య కాదు.. రైతులు, కూలీలు స్వెటర్లు లేకుండా ఎందుకున్నారనేదే సమస్య - రాహుల్ గాంధీ..

By team teluguFirst Published Jan 5, 2023, 10:42 AM IST
Highlights

భారత్ జోడో యాత్రలో తాను టీ షర్ట్ తో ఉండటం సమస్య కాదని.. రైతులు, కూలీలు స్వెట్టర్లు లేకుండా ఎందుకున్నారనేదే అసలైన సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు. యువత, రైతులు, కార్మికులను భయపెట్టడమే బీజేపీ విధానం అని ఆయన ఆరోపించారు. 

భారత్ జోడో యాత్రలో తనతో పాటు చిరిగిన బట్టలు వేసుకున్న అనేక మంది పేద రైతులు, కూలీల పిల్లలు తనతో కలిసి నడుస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. తాను ఈ పాదయాత్రలో టీ షర్ట్‌ పై ఉండటం అసలు సమస్యే కాదని అన్నారు. చలికాలంలో పేదల పిల్లలు స్వెటర్, జాకెట్ లేకుండా ఎందుకు నడుస్తున్నారని ఇదే అసలు సమస్య అని అన్నారు. కానీ ఈ విషయం మీడియా ఎందుకు అడగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

బీజేపీ మతతత్వ విధానాలకు అధికంగా బ‌ల‌వుతున్న‌ది జమ్మూకాశ్మీర్ ప్రజలే.. : మెహబూబా ముఫ్తీ

భారత్ జోడో యాత్ర బుధవారం బాగ్పత్-షామ్లీ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన బరౌత్ వద్ద ఏర్పాటు చేసిన 'నూకడ్ సభ' (స్ట్రీట్ కార్నర్ మీటింగ్) ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘నా టీ-షర్ట్‌పై ప్రశ్నలు అసలు సమస్య కాదు. భారతదేశంలోని పిల్లలు, రైతులు, కార్మికులు, శీతాకాలంలో వెచ్చని బట్టలు లేకుండా తిరగడం నిజమైన సమస్య’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

నోయిడాలో ఢిల్లీ తరహా యాక్సిడెంట్.. స్విగ్గి డెలివరీ బాయ్ ను ఢీకొట్టి 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆయన విమర్శలు చేశారు. గతంలో యువత 15 సంవత్సరాలు భారత సైన్యంలో పనిచేసి పెన్షన్ పొందేవారని, అయితే ప్రధాని మోడీ ఒక విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఆ పథకం ద్వారా యువకులను నాలుగేళ్ల తర్వాత తరిమికొట్టాలని ప్రధాని మోడీ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇంటిముందు మూత్ర విసర్జన.. వద్దన్నందుకు తుపాకీతో కాల్పులు..ఒకరు మృతి...

దేశానికి సేవ చేయాలనేది వారి కల అని, వారు 15 సంవత్సరాలు పని చేసి పెన్షన్ కూడా పొందవచ్చని ఆయన అన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్లు పని చేస్తే మిమ్మల్ని తరిమివేస్తామని చెప్పారు. ‘‘దేశానికి సేవ చేయాలనేది వారి కల. వారు 15 సంవత్సరాలు పని చేసి, పెన్షన్ కూడా పొందేవారు. అయితే ప్రధాని మోడీ..‘నాలుగు సంవత్సరాలు పని చేయండి. తరువాత మిమ్మల్ని తరిమికొడుతాం.’అని అన్నారు. ఇదే కొత్త హిందుస్థాన్’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. 

అడవిలో దొరికిన వెంట్రుకలు,ఎముకలు శ్రద్దావే.. డీఎన్ఏ రిపోర్టులో వెల్లడి..

యువత, రైతులు, కార్మికులను భయపెట్టడమే బీజేపీ విధానం అని రాహుల్ గాంధీ అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వైపు ప్రజల దృష్టిని మరల్చడమే  తన భారత్ జోడో యాత్ర లక్ష్యం అని తెలిపారు. ‘‘ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.400కు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవారు. కానీ ఇప్పుడు రూ.1,100కు పెరిగింది. ఈ తేడా ఎవరి జేబులోకి వెళ్తుంది ? అది నరేంద్ర మోడీ ప్రత్యేక స్నేహితులైన ముగ్గురి, నలుగురి జేబుల్లోకి వెళుతోంది.’’ అని ఆయన ఆరోపించారు. 

click me!