UP elections 2022: బహుజన్ సమాజ్ పార్టీ రూటే స‌పరేట్.. : మాయావతి

Published : Mar 04, 2022, 01:18 AM IST
UP elections 2022: బహుజన్ సమాజ్ పార్టీ రూటే స‌పరేట్.. : మాయావతి

సారాంశం

UP elections 2022: త‌న పార్టీ పని తీరు.. ఇత‌ర పార్టీల ప‌నితీరు చాలా విభిన్నంగా ఉంటుంద‌ని  బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మ‌య‌వ‌తి అన్నారు. త‌న పార్టీ ఇతర పార్టీలను కాపీ కొట్టడం లేదనీ, అందుకే రోడ్‌షోలను నిర్వ‌హించ‌ద‌నీ, ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించమనీ.. ప్రచారం ఎలా చేయాలో కాన్షీరాం మాకు నేర్పించారని తెలిపారు.  త‌మ‌కంటూ ఒక ప్రత్యేకమైన ప్రచార శైలి ఉందనీ,  మిగతా పార్టీలే త‌మ విధానాల‌ను  కాపీ కొడతాయని అని మాయావతి అన్నారు.  

UP elections 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ( బీఎస్పీ) అధికారంలోకి వస్తే .. భదోహి జిల్లాపేరును సంత్ రవిదాస్ నగర్‌గా మారుస్తామని, వారణాసి డివిజన్ అభివృద్ధికి ప‌లు ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మ‌య‌వ‌తి హ‌మీ ఇచ్చారు.  2007లో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, అనేక జిల్లాలు, సంస్థలు, పార్కులకు దళితుల మ‌హానీయుల (ఐకాన్‌) పేర్లు పెట్టిందనీ. 2012లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మ‌హానీయుల పేర్ల‌ను తొలగించిందనీ.. అనంత‌రం బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత .. ఆ పేర్లను పునరుద్ధరించడంలో విఫలమైంది. ఎస్పీ, బీజేపీలు దళిత వ్యతిరేక పార్టీల‌ని, ఈ చ‌ర్య‌నే స్పష్టం చేస్తుంద‌ని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నియోజకవర్గం వారణాసిలో మీడియాతో మాయావతి మాట్లాడుతూ..  యూపీలో ఐదేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో ముస్లింలు, బ్రాహ్మణులు దోపిడీకి, వేధింపులకు గురయ్యారని ఆమె ఆరోపించారు. త‌న పార్టీ పని తీరు.. ఇత‌ర పార్టీల ప‌నితీరు చాలా విభిన్నంగా ఉంటుంద‌ని అన్నారు. త‌న పార్టీ ఇతర పార్టీలను కాపీ కొట్టడం లేదనీ, అందుకే రోడ్‌షోలు చేయము, ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించము. ప్రచారం ఎలా చేయాలో కాన్షీరాం మాకు నేర్పించారు. మా పార్టీ క్యాడర్‌తో మేము ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం. మాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రచార శైలి ఉంది. మిగతా పార్టీలే మమ్మల్ని కాపీ కొడతాయని అని మాయావతి అన్నారు. సమాజాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని.. అభ్యర్థులను ఎంపిక చేశానని చెప్పారు. 
  
ముస్లిం కమ్యూనిటీకి చెందిన మాఫియోసీపై ముఖ్యమంత్రి యోగి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం బుల్డోజర్లను నడిపిందనీ, తూర్పు యుపిలో క్రియాశీలంగా ఉన్న ఇతర వర్గాలకు చెందిన మాఫియాలపై ఎటువంటి చర్య తీసుకోలేదనీ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై ముస్లిం సమాజం ద్వేషంతో నిండిపోయిందనీ. బీజేపీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని ఆమె అన్నారు. యూపీలో ముస్లింలు నిరంతరం భయంతో జీవిస్తున్నారనీ.. వారిని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిలా చూసిందనీ.. బ్రాహ్మణ సమాజం కూడా నిర్లక్ష్యానికి గురవుతోందనీ,  మా పార్టీ అన్ని వర్గాల అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీని వదిలించుకోవాలంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఎస్పీకి ఓటు వేయాలని  ఆమె అన్నారు.

మీడియా యూపీ ఎన్నికలను బైపోలార్‌గా చూపుతోందని, బీఎస్పీని రేసులో లెక్కించడం లేదని బీఎస్పీ చీఫ్ అన్నారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు వారిని ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు వ్యతిరేకమ‌నీ, బీఆర్ అంబేద్కర్ ఆశ‌యాల‌ను గౌరవించలేదనీ,   మండల్ కమిషన్ నివేదికను కూడా అమలు చేయలేదనీ. ఎస్పీ ప్రభుత్వ హయాంలో గూండాలు, అల్లరి మూకలు రాజకీయాల్లో పెత్తనం సాగించారనీ, అభివృద్ధి అనేది ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా ఓ కులానికే పరిమితమైందని అన్నారు. వివాదాస్పద చట్టాలు/కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేయబోమని, నేరస్థులను జైలుకు పంపిస్తామని బీఎస్పీ చీఫ్ మ‌య‌వ‌తి ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పునరుద్ధరించడంతోపాటు వాటి అమలుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే