రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన మయవతి .. ఇంతకీ ఏమన్నారంటే..?  

By Rajesh KarampooriFirst Published Jun 3, 2023, 3:24 AM IST
Highlights

కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ గత మూడు రోజులుగా అమెరికా పర్యటిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో ఆయన  మరోసారి చేసిన వ్యాఖ్యలు భారత్‌లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై భారతదేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన ప్రకటనపై బీజేపీ ఇప్పటికే మాటల దాడి చేసింది. అయితే ఇప్పుడు మాజీ ఎంపీ ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాయావతి ట్వీట్ చేశారు.

దేశంలో దళిత, ముస్లిం ప్రజలు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాహుల్ గాంధీ చెప్పింది చేదు నిజం. ఇందుకు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ దోషులే. అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.  

కాంగ్రెస్ పై మయవతి ఫైర్ 

మాయావతి ఇంకా మాట్లాడుతూ, 'ఇది కాంగ్రెస్ లేదా బిజెపి లేదా ఎస్‌పి ప్రభుత్వమైనా, యుపితో సహా ఇతర రాష్ట్రాల్లో పేదలు, మెజారిటీ బహుజనులపై  ప్రతి స్థాయిలో అన్యాయం-దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయి. ఇది సర్వసాధారణం. యూపీలో కేవలం బీఎస్పీ ప్రభుత్వంలో చట్టబద్ధంగా పాలనను నెలకొల్పడం ద్వారా అందరికీ న్యాయం జరిగింది. అని పేర్కొన్నారు. 

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే.. 

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన మొహబ్బత్ కీ దుకాన్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. 'నేడు భారతదేశంలో పేదలు, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు నిస్సహాయంగా ఉన్నారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 1980 లో దళితుల పరిస్థితి కంటే..ప్రస్తుతం వారి పరిస్థితి కడు దయనీయంగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కూడా అందుకు కారణం ' అని అన్నారు.

click me!