
NCERT: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కు చెందిన పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు చేశారు. ఇటీవల 10, 11, 12 సిలబస్ పుస్తకాలలో కొన్ని తొలగింపులు చేసింది. ఇప్పటికే 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో జాతిపిత మహాత్మా గాంధీజీకి సంబంధించిన కొన్ని అంశాలతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై నిషేధానికి సంబంధించిన అంశాలను తొలగించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సంబంధించిన పాఠ్యాంశాలను తొలిగించినట్టు తెలుస్తోంది. 11వ తరగతి కొత్త పొలిటికల్ సైన్స్ పుస్తకంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించినట్లు సమాచారం.
అలాగే.. కొత్త పుస్తకంలో జమ్మూ కాశ్మీర్ , ఆర్టికల్ 370కి సంబంధించిన కొంత సమాచారం కూడా తొలగించబడినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం.. NCERT కొత్త పుస్తకంలో చేసిన మార్పుల జాబితాను విడుదల చేసింది, అప్పుడు 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పబడింది. కానీ, పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 11వ తరగతికి చెందిన పాత పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సంబంధించిన పలు ఆంశాలను ప్రస్తావించడం జరిగింది. కానీ.. కొత్త పుస్తకంలో ఆయనకు సంబంధించిన పేరాను తొలగించారు.
ఇంతకీ మౌలానా ఆజాద్ ఎవరు?
మౌలానా ఆజాద్ స్వాతంత్ర సమార యోధుడు, దేశ తొలి విద్యా మంత్రి. 1946లో రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. ఈ సభే భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఆయన 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత , నిర్బంధ ప్రాథమిక విద్య తీసుకరావాలని డిమాండ్ చేసిన సంస్కర్త. అనేక సామాజిక సంస్కరణలలో కీలక పాత్ర పోషించాడు. ఆయన జామియా మిలియా ఇస్లామియా, వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , స్కూల్‌లో కీలక వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్లానింగ్ , ఆర్కిటెక్చర్ కూడా.
ఇంకా ఏమి తీసివేయబడిందంటే..?
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కు చెందిన పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు చేశారు. అలాగే కొత్త పుస్తకంలోని 10వ తరగతిలో జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా తొలగించారు.అలాగే.. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో జాతిపిత మహాత్మా గాంధీజీ, నాథూరామ్ గాడ్సే కి సంబంధించిన కొన్ని అంశాలతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)వంటి పాఠ్యాంశాలను తొలగించారు. అలాగే గుజరాత్ అల్లర్లు, మొఘల్స్ పాలన, ఎమర్జెన్సీ, కోల్డ్‌వార్, నక్సలైట్ ఉద్యమం, కోర్టులకు సంబంధించిన పాఠ్యాంశాల్లోని కొన్ని భాగాలను కూడా తొలగించారు. కాగా, ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలో చేసిన ఈ మార్పులపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.