శ్రీకృష్ణజన్మాష్టమి 2022 : మధుర ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీ, ఊపిరాడక ఇద్దరు మృతి

By Bukka SumabalaFirst Published Aug 20, 2022, 7:54 AM IST
Highlights

జన్మాష్టమి సందర్భంగా దేవాలయాల్లో అర్ధరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ ఆలయాలకు పోటెత్తారు. మధురలోని ఓ ఆలయంలో ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు భక్తులు మరణించారు. 

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని ఓ ఆలయంలో జన్మాష్టమి వేడుకల సందర్భంగా రద్దీ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఈరోజు పోలీసులు తెలిపారు. బాంకే బిహారీ ఆలయంలో అర్ధరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

"జన్మాష్టమి సందర్భంగా, భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. ఆరతి సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఊపిరాడక ఇద్దరు మరణించారు" అని మధుర సీనియర్ పోలీసు అధికారి అభిషేక్ యాదవ్ చెప్పారు. శ్రీకృష్ణుని జన్మస్థలంగా పరిగణించే మధురలో జన్మాష్టమి వేడుకలు అంబరాన్నంటుతాయి. భక్తులు ఆ రోజు ఇక్కడికి వచ్చి కృష్ణుడిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు. 

రాజస్థాన్ ఫస్ట్.. ఏపీ లాస్ట్.. ఈ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వే..

అంతకుముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం", శ్రీ కృష్ణ భగవానుడి బోధనలు మన ఆలోచనలను, మన పనులను, మన దృష్టికోణాన్ని ప్రభావితం చేస్తాయి. భిన్నంగా చూసేలా ప్రేరేపిస్తాయి.

"శ్రీకృష్ణుడు సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈ భూమిపై సంచరించాడు. కృష్ణ 'లీలలు' ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కృష్ణారాధన అనేక ప్రాంతాల్లో జరుపుతారు’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మధురలో, భక్తులు "హరే రామ హేరా కృష్ణ" పాటలకు నృత్యం చేస్తూ భక్తి పారవశ్యంతో కనిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ దేవాలయాల్లోనూ ఇదే ఉత్సాహం కనిపించింది. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుని జననం అర్ధరాత్రి జరిగింది. జన్మాష్టమి నాడు అర్ధరాత్రి పూజల అనంతరం ప్రత్యేక ప్రసాద వితరణ చేస్తారు.

click me!