జ‌మ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్ర‌కుట్ర భ‌గ్నం.. న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

Poonch: జ‌మ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్ర‌కుట్రను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు భ‌గ్నం చేశాయి. పూంచ్‌లో నలుగురు విదేశీ ఉగ్రవాదులను మ‌ట్టుబెట్టాయి. జూలై 16-17 మధ్య రాత్రి పూంచ్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలు పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి.
 

Massive terrorist plot foiled in Jammu and Kashmir, Four terrorists killed RMA

Jammu Kashmir encounter: జ‌మ్మూకాశ్మీర్ లోని పూంచ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భద్రతా దళాల మధ్య మొదటి కాల్పులు జరిగాయనీ, ఆ తర్వాత డ్రోన్లతో పాటు ఇతర రాత్రి నిఘా పరికరాలను మోహరించామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. అలాగే, మంగ‌ళ‌వారం తెల్లవారు జామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో మళ్లీ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. పూంచ్ లోని సింధార ప్రాంతంలో భారత ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, రాష్ట్రీయ రైఫిల్స్, జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్ లో హతమైన ఉగ్రవాదులు ఎక్కువగా విదేశీ ఉగ్రవాదులేననీ, వారి ఆచూకీ తెలుసుకుంటున్నామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

ఈ ఎన్ కౌంట‌ర్ గురించి సంబంధిత అధికారుల వివ‌రాల ప్ర‌కారం.. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు భారీ సాయుధులైన విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారనీ, ఈ విజయవంతమైన ఆపరేషన్ ఈ ప్రాంతంలో సాధ్యమయ్యే ఉగ్రవాద దాడులను అరికట్టిందని ఆర్మీ పేర్కొంది. అంత‌కుముందు, రాత్రి పూంచ్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారీ చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేసిన ఒక రోజు తర్వాత నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Latest Videos

జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) ముఖేష్ సింగ్ సూరంకోట్‌లోని సిందారా టాప్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ధృవీకరించారు. "కొనసాగుతున్న 'ఆపరేషన్ త్రినేత్ర II' సమయంలో నలుగురు విదేశీ ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలో ఉన్నార‌ని స‌మాచారం అందింది. భారీ సాయుధ ఉగ్రవాదులు లోతట్టు ప్రాంతాలలో ఉండటం ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను సూచిస్తోంది. సమయానికి వారిని అడ్డుకోక‌పోతే ఉగ్రదాడులు జ‌రిగే అవ‌కాశ‌ముంది" అని ఆరో సెక్టార్ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్ బ్రిగేడియర్ ఎంపీ సింగ్ పూంచ్‌లో విలేకరులతో అన్నారు. కాగా, ఏప్రిల్ 20న పూంచ్‌లోని మెంధార్ ప్రాంతంలో భద్రతా దళాల వాహనాలపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించిన నేపథ్యంలో సైన్యం 'ఆపరేషన్ త్రినేత్ర' ప్రారంభించింది.

vuukle one pixel image
click me!