అస్సాంలోని జోర్హాట్ చౌక్ మార్కెట్‌లో గురువారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 100 కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. పలు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మార్కెట్ ప్రధాన ద్వారం సమీపంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో అనుమానాస్పద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
అస్సాంలోని జోర్హాట్‌లో గురువారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది.అగ్నిప్రమాదంలో 100 కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి చెందిన పలు వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. అర్థరాత్రి ఒంటిగంట వరకు మంటలను ఆర్పే పని కొనసాగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్ ప్రధాన గేటుకు సమీపంలో ఉన్న ఓ బట్టల దుకాణం నుంచి మంటలు చెలరేగాయి. క్రమేపీ విస్తరిస్తూ రాత్రి 1 గంట వరకు దాదాపు 100 దుకాణాలు దగ్ధమైనట్లు సమాచారం.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. జోర్హాట్‌లోని AT రోడ్‌లో చౌక్ బజార్ ఉంది. ఇక్కడి ఓ బట్టల దుకాణంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో దుకాణదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి 100కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందన్న సమాచారం అందకపోవడం ఉపశమనం కలిగించే అంశం.
రాత్రికి రాత్రే 25కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. బట్టల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఇప్పటివరకు విచారణలో తేలిందని ఫయే బ్రిగేడ్ తెలిపింది. అక్కడి నుంచి ఇతర దుకాణాలకు చేరింది. ఈ ఘటన జరిగినప్పుడు మార్కెట్‌లోని షాపులన్నీ మూసి ఉంచారని, దీంతో ఎవరికీ మంటలు చెలరేగలేదని పోలీసులు చెబుతున్నారు. 100 దుకాణాలలో చాలా వరకు బట్టలు , కిరాణా దుకాణాలు ఉన్నట్టు సమాచారం.
అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇక్కడి రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్నిమాపక దళం వాహనాలను బయటకు తీయడంలో ఇబ్బంది ఏర్పడుతోంది. ఆలస్యం కావడంతో మంటలు అంతకంతకూ వ్యాపించాయి.
| Assam: Fire breaks out at Jorhat's Chowk Bazaar. Several fire tenders have reached the spot. The fire started at a cloth shop near the main gate of the market. Further details awaited. pic.twitter.com/5nG48kDiVq
— ANI (@ANI)