
Massive Fire Breaks Out At Bhopal's Satpura Bhawan: భోపాల్ లోని సత్పురా భవన్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భవనంలో పలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఉన్న సాత్పురా భవన్ సముదాయంలోని ఓ భవనంలోని మూడో అంతస్తులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు.
మూడో అంతస్తులో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కిటికీల నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే అవి నాల్గవ అంతస్తుకు వ్యాపించాయి. భవనంపై నల్లటి పొగ కమ్ముకోవడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు దారి మధ్యలో ఆగిపోయారు. అగ్నిప్రమాదంలో పలు కీలక ప్రభుత్వ పత్రాలు ధ్వంసమయ్యాయని సమాచారం. మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.