
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఆరు అంతస్తుల హోటల్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అప్పమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో భాగంగా.. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మందిని రక్షించారు.
నగరంలోని పప్పాయ ట్రీ హోటల్‌లో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని అన్ని అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. తొలుత హోటల్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు మరింత వ్యాపించడంతో అత్యవసర సేవలను పిలిపించారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్వితే ఇక ఐదేళ్ల జైలు శిక్ష.. హెచ్చరికలు జారీ చేసిన రైల్వే శాఖ
మంటల కారణంగా పొగలు వ్యాపించడంతో భవనంలోని ఆరో అంతస్తులో కొంతమంది వ్యక్తులు చిక్కుకుపోయారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందాలు వారిని సురక్షితంగా తీసుకురావడానికి నిచ్చెనలను ఉపయోగించాల్సి వచ్చింది. "ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని నిచ్చెనలు ఉపయోగించి సురక్షితంగా రక్షించారు. పొగ కారణంగా వారు చాలా భయపడ్డారు" అని సీనియర్ ఇండోర్ పోలీసు అధికారి ఆర్ఎస్ నింగ్వాల్ తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు కనిపించిన దాని ప్రకారం.. మంటల కారణంగా ఆరో అంతస్తులో చిక్కుకున్న వ్యక్తులు బెడ్‌షీట్లను కట్టి, కిందకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. దుప్పట్లను తాళ్లలాగా కిందకు విసిరినట్లు కనిపిస్తుంది. మంటల నుండి అనేక కిలోమీటర్ల దూరం వరకు పొగ కనిపిస్తుంది. అగ్నిమాపక యంత్రాలు, మునిసిపల్ ట్యాంకర్లు సహాయక చర్యలకు సహాయపడటానికి హోటల్ వద్ద ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.