ఇండోర్ లోని హోట‌ల్ లో భారీ అగ్నిప్ర‌మాదం.. 8 మందిని రక్షించిన అగ్నిమాప‌క సిబ్బంది

Published : Mar 29, 2023, 01:28 PM IST
ఇండోర్ లోని హోట‌ల్ లో భారీ అగ్నిప్ర‌మాదం.. 8 మందిని రక్షించిన అగ్నిమాప‌క సిబ్బంది

సారాంశం

Indore: ఇండోర్ లోని ఒక హోటల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ పొగ‌, మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి.  స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ఇప్పటివరకు 8 మందిని రక్షించారు.  న‌గ‌రంలోని Papaya Tree Hotel లో బుధ‌వారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బహుళ అంతస్తుల భవనంలోని అన్ని అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి.  

Papaya Tree Hotel fire accident: ఇండోర్ లోని ఒక హోటల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ పొగ‌, మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి.  స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ఇప్పటివరకు 8 మందిని రక్షించారు.  న‌గ‌రంలోని Papaya Tree Hotel లో బుధ‌వారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బహుళ అంతస్తుల భవనంలోని అన్ని అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి.

వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ ఆరంతస్తుల హోటల్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటివరకు ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మందిని రక్షించారు. న‌గ‌రంలోని Papaya Tree Hotel లో బుధ‌వారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బహుళ అంతస్తుల భవనంలోని అన్ని అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. తొలుత హోటల్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు మరింత వ్యాపించడంతో అత్యవసర సేవలకు ఫోన్ చేయాల్సి వచ్చింది.

పొగ కారణంగా భవనంలోని ఆరో అంతస్తులో ఉన్నవారు చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు వారిని సురక్షితంగా తీసుకురావడానికి నిచ్చెనలను ఉపయోగించాల్సి వచ్చింది. ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మందిని నిచ్చెనలతో సురక్షితంగా రక్షించారు. పొగ కారణంగా వారు చాలా భయపడ్డారని ఇండోర్ సీనియర్ పోలీసు అధికారి ఆర్ఎస్ నింగ్వాల్ తెలిపారు.

ఆరో అంతస్తులో చిక్కుకున్న వ్యక్తులు బెడ్ షీట్లు కట్టి కిందికి దిగే ప్రయత్నంలో తాళ్లలా కిందకు విసిరేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కిలోమీటర్ల దూరం నుంచి మంటల నుంచి పొగలు వస్తున్నాయి. సహాయక చర్యల కోసం పలు అగ్నిమాపక యంత్రాలు, మున్సిపల్ ట్యాంకర్లు హోటల్ వద్ద చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

PREV
click me!

Recommended Stories

IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu