వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్వితే ఇక ఐదేళ్ల జైలు శిక్ష.. హెచ్చరికలు జారీ చేసిన రైల్వే శాఖ

By Asianet NewsFirst Published Mar 29, 2023, 1:34 PM IST
Highlights

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఆకతాయిలు రాళ్లు విసురుతున్నారు. దీంతో రైల్వే ఆస్తులకు నష్టం వాటిళ్లుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సీరియస్ అయ్యింది. రైళ్లపై రాళ్ల దాడి చేస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. 

భారత సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అందుకే ఈ రైళ్లు అనతి కాలంలోనే ప్రజలను అభిమానాన్ని చొరగొన్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరాన్ని చేరుకోగలిగే ఇలాంటి రైళ్లను మరిన్ని మార్గాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ లక్సరీ రైళ్లపై రాళ్లు రువ్వుతున్న ఘటనలు ఇటీవల పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పెరుగుతున్న అక్ర‌మ వ‌ల‌స‌లు.. ఎన్నార్సీని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్వుతే కఠిన చర్యలు తప్పవని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది. రైళ్లపై రాళ్లు రువ్వడం క్రిమినల్ నేరమని దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, దీని వల్ల 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడొచ్చని పేర్కొంది.

ఇటీవల తెలంగాణలోని పలు చోట్ల వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఈ హెచ్చరిక వెలువడింది. కాజీపేట, ఖమ్మం, కాజీపేట, భోంగిర్‌, ఏలూరు-రాజమండ్రి తదితర ప్రాంతాల్లో రాళ్ల దాడి జరిగింది. దీంతో ఇందులోని కొన్ని ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇటీవలి కాలంలో వందే భారత్ రైళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారని, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు తొమ్మిది నమోదయ్యాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇలాంటి ఘటనలు నేరమని, రాళ్లు రువ్వడం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

వయనాడ్‌కు ఉప ఎన్నికను ప్రకటించని ఈసీ.. కారణమిదే..

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్విన 10 మందిని దక్షిణ మధ్య రైల్వే రీజియన్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అరెస్టు చేసిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. రాళ్లదాడి ఘటనల్లో 6 నుంచి 17 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలకు దూరంగా ఉండేందుకు పిల్లలకు కౌన్సిలింగ్, విద్య, మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలదేనని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం సరైంది కాదని పేర్కొంది.  ఇప్పటి వరకు ఆర్పీఎఫ్ పలు కేసులు నమోదు చేసి 39 మంది నేరస్థులను అరెస్టు చేసి జైలుకు పంపింది. 

వెజిటేరియన్ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్... మహిళ రియాక్షన్ ఇదే..!

కాగా.. ఇలాంటి ఘటనలను నివారించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ట్రాక్ ల సమీపంలోని గ్రామాల సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. సర్పంచ్ లను మన్వయం చేసుకుంటూ, వారిని గ్రామ మిత్రలుగా మారుస్తూ అనేక నివారణ చర్యలను చేపడుతోందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ తెలిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. 

click me!