సర్జికల్స్ స్ట్రైక్-2: గుజరాత్ తీరంలో పాక్ డ్రోన్...

By Siva KodatiFirst Published Feb 26, 2019, 12:05 PM IST
Highlights

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన నేపథ్యంలో ఏ క్షణమైనా పాకిస్తాన్ ప్రతిదాడికి పాల్పడే అవకాశం ఉంది. పీఓకే నుంచి భారత యుద్ధ విమానాలు వెనుదిరిగి వచ్చేసిన తర్వాత భారత త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన నేపథ్యంలో ఏ క్షణమైనా పాకిస్తాన్ ప్రతిదాడికి పాల్పడే అవకాశం ఉంది. పీఓకే నుంచి భారత యుద్ధ విమానాలు వెనుదిరిగి వచ్చేసిన తర్వాత భారత త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి.

తీర ప్రాంతంతో పాటు పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లపై గట్టి నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుజరాత్ సరిహద్దుల్లో ఓ గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టింది.

అనుమానాస్పదంగా ఉన్న ఆ డ్రోన్‌ను భారత సైన్యం పేల్చివేసింది. దీనిని పాకిస్తాన్‌కు చెందినదిగా అనుమానిస్తున్నారు. తాజా ఘటనతో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

సర్జికల్స్ స్ట్రైక్-2: భారత్‌పై పాక్ దాడి చేస్తే..?

click me!