మాస్క్ తప్పనిసరి.. రాత్రి 1 గంటల వరకే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్: కర్ణాటక ప్రభుత్వ ప్రకటన

By Mahesh KFirst Published Dec 26, 2022, 4:15 PM IST
Highlights

కర్ణాటక ప్రభుత్వం మాస్క్ మ్యాండేటరీ చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే, న్యూ ఇయర్ వేడుకలు రాత్రి 1 గంటలోపే ముగించాలని స్పష్టం చేసింది.
 

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం మాస్క్ మ్యాండేటరీ చేసింది. స్కూల్స్, కాలేజీలు, మాల్స్, మూవీ థియేటర్లు హా బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సోమవారం ఆదేశించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లలోనూ మాస్క్ మ్యాండేటరీ అని ప్రకటించింది. పొరుగు దేశం చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ముందుజాగ్రత్తగా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

నిపుణులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం తర్వాత కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీలు, మూవీ థియేటర్ల‌లలో మాస్కులను తప్పనిసరి చేశామని అన్నారు. పబ్, రెస్టారెంట్, బార్‌లలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలనుకుంటే మాస్క్ మ్యాండేటరీ అని వివరించారు.

అంతేకాదు, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ రాత్రి 1 గంటలోపే ముగియాలని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రాత్రి ఒంటి గంటలోపే నూతన సంవత్సర వేడుకలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎవరూ బయపడాల్సిన పని లేదని, కేవలం ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన అన్నారు. 

Also Read: పండుగలను జ‌రుపుకొండి, కానీ కోవిడ్ జాగ్రత్తలు పాటించండి: ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఇండోర్ ప్లేస్‌లలో, క్లోజ్డ్‌ స్పేస్‌లలో మాస్క్ మ్యాండేటరీ చేసింది. గురువారం ఈ మేరకు ప్రకటన చసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం మాక్ డ్రిల్ చేపట్టనుంది.

డిసెంబర్ నెలలో బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 12 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ అయినట్టు ఆరోగ్య మంత్రి తెలిపారు. పాజిటివ్ కేసుల శాంపిళ్లు అన్నింటినీ వేరియంట్ల గుర్తింపు కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించినట్టు వివరించారు.

click me!