పెళ్లి చేసుకున్నా.. ఆ యువతిని వదలని దుండగుడు.. తననే పెళ్లి చేసుకోవాలని బెదిరింపులు.. చివరకు..!

Published : Sep 22, 2022, 07:56 PM IST
పెళ్లి చేసుకున్నా.. ఆ యువతిని వదలని దుండగుడు.. తననే పెళ్లి చేసుకోవాలని బెదిరింపులు..   చివరకు..!

సారాంశం

యూపీకి చెందిన యువతిని ఓ దుండగుడు పదే పదే వేధించాడు. ఆ యువతి మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం మానుకోలేదు. తనను పెళ్లి చేసుకోకుంటే.. ఆమె భర్త, ఆమె అత్తను చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 26 ఏళ్ల వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకోకముందు సోను అనే పోరంబోకు వెండించేవాడు. పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధించేవాడు. 26 ఏళ్ల పూజకు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా సోను వేధింపులు ఆగలేవు. దీంతో ఆ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె మరణంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. సోను అనే దుర్మార్గుడు తమ కూతురిని తరుచూ పెళ్లి చేసుకోవాలని వేధించేవాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కూతురు పూజ.. దీపక్ అనే యువకుడిని ఈ ఏడాది పెళ్లి చేసుకుందని తెలిపారు. పూజ పెళ్లి చేసుకున్నప్పటికీ సోను, ఆయన ఇద్దరు మిత్రుడు తమ కుమార్తెను వేధించడం మానలేదని వివరించారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదనను అంగీకరించకుంటే పూజ భర్త, పూజ అత్తను చంపేస్తామని సోను బెదిరించాడని ఆరోపించారు. దీంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. 

జానక్‌పూర్‌లోని ఇంటిలో సీలింగ్‌కు ఉరి వేసుకుని మరణించినట్టు బుధవారం పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రధాన నిందితుడు సోనుపై, అతని ఇద్దరు మిత్రులు విజయ్ పాల్, రాహుల్‌లపై కేసు నమోదు చేశామని వివరించారు. వారు పరారీలో ఉన్నారని తెలిపారు. సూసైడ్‌కు ప్రేరేపించినట్టుగా వారిపై కేసు నమోదైందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు