ఈ రోజు టాప్ టెన్ వార్తలు..
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను నేటి సాయంత్రం ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. పూర్తి కథనం
కాంగ్రెస్‌లోకి బీజేపీకి జితేందర్ రెడ్డి ?
బీజేపీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి ఈ లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ ఆయనను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి కథనం
రేపే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన..
సార్వత్రిక ఎన్నికలు 2024, పలు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే లోక్ సభ, పలు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను శనివారం ప్రకటించనుంది. పూర్తి కథనం
యడియూరప్ప పై లైంగిక వేధింపుల కేసు..
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి కథనం
శరణార్థుల నిరసనపై కేజ్రీవాల్ అసహనం..
సీఏఏపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై పలు దేశాలకు చెందిన హిందూ, సిక్కు శరణార్థులు మండిపడ్డారు. సీఎం నివాసం ఎదుట నిరసన తెలిపారు. దీంతో కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పూర్తి కథనం
మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వెనుక నుంచి ఎవరో తోసారు. దీంతో తలకు తీవ్రగాయంలో ఆమె ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చేరినట్టు ఆ ఆస్పత్రి డైరెక్టర్ మణిమోయ్ బెనర్జీ తెలిపారు. పూర్తి కథనం
తెలంగాణలో బీజేపీకి రెట్టింపు సీట్లు.. ?
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ దూకుడు ప్రదర్శించనుంది. న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే అంచనాల ప్రకారం బీజేపీ 8 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు గెలుచుకుంటాయి. పూర్తి కథనం
అమితాబచ్చన్ కు తీవ్ర అస్వస్థత..
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆయనకు సర్జరీ కూడా చేయాల్సి ఉందని బాలీవుడ్ సమాచారం. ఇంతకీ అమితాబ్ కు ఏమయ్యింది. పూర్తి కథనం
Tata IPL 2024 కు దూరమైన టాప్-8 స్టార్ క్రికెటర్లు..
Tata IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ (ఐపీఎల్ 2024) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్‌లో జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే, ఐపీఎల్ 2024కు పలువురు స్టార్ ప్లేయర్లు దూరం అయ్యారు. పూర్తి కథనం
మరో 5జి ఫోన్ సీక్రెట్ లాంచ్..
ప్రముఖ కంపెనీ Vivo ఈ రోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో రాబోయే వారంలో కొత్త VIVO T3 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. పూర్తి కథనం