సోంచంద్‌భాయ్ సోలంకీ, పురుషోత్తమ్ మౌలంకర్, అమృత్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలా, ఎల్ కే అద్వానీ , అటల్ బిహారీ వాజ్‌పేయ్, అమిత్ షా వంటి దిగ్గజాలు గాంధీనగర్ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1989 నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోలేదంటే కమలనాథుల పట్టును అర్ధం చేసుకోవచ్చు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ గాంధీ నగర్ నుంచి ఆరుసార్లు విజయం సాధించి పార్టీకి బలమైన పునాదిని వేశారు. గాంధీ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 19,45,772 మంది ఓటర్లున్నారు. వీరిలో 10,04,291 మంది పురుషులు.. 9,41,434 మంది మహిళలు. 1989 తర్వాతి నుంచి బీజేపీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈసారి తమ అభ్యర్ధిగా సౌమ్య పుహాన్‌ను ఆ పార్టీ ప్రకటించింది.
గుజరాత్‌లోని కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో గాంధీ నగర్ ఒకటి. హేమాహేమీలైన నేతలు ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. సోంచంద్‌భాయ్ సోలంకీ, పురుషోత్తమ్ మౌలంకర్, అమృత్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలా, ఎల్ కే అద్వానీ , అటల్ బిహారీ వాజ్‌పేయ్, అమిత్ షా వంటి దిగ్గజాలు గాంధీనగర్ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1967లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ ఆ తర్వాత బీజేపీకి పెట్టని కోటగా మారింది. 1989 నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోలేదంటే కమలనాథుల పట్టును అర్ధం చేసుకోవచ్చు.
గాంధీనగర్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. 1989 నుంచి ఓడిపోని బీజేపీ :
గాంధీ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్‌పూర్, నారన్‌పురా, సబర్మతి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 79 శాతం అర్బన్ ఓటర్లే, అలాగే గణనీయమైన సంఖ్యలో హిందూ జనాభా వున్నారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ గాంధీ నగర్ నుంచి ఆరుసార్లు విజయం సాధించి పార్టీకి బలమైన పునాదిని వేశారు.
గాంధీ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 19,45,772 మంది ఓటర్లున్నారు. వీరిలో 10,04,291 మంది పురుషులు.. 9,41,434 మంది మహిళలు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి అమిత్ షాకి 8,94,000 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి చతౌర్‌సిన్హ్ జావాంజీ చావ్డాకి 3,37,610 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 5,57,014 ఓట్ల తేడాతో విజయం సాధించింది.
గాంధీనగర్ ఎంపీ ( పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఈసారైనా కాంగ్రెస్ జెండా ఎగురుతుందా :
గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అమిత్ షా మరోసారి బరిలో దిగుతున్నారు. ఇక్కడ బీజేపీ క్షేత్ర స్థాయిలో బలంగా వుండటంతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో వుంది. వీటన్నింటికి మించి మోడీ ఛరిష్మా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే .. గాంధీనగర్‌లో హస్తం పార్టీ గెలిచి 40 ఏళ్లు కావొస్తోంది. చివరిసారిగా 1984లో జీఐ పటేల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 1989 తర్వాతి నుంచి బీజేపీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈసారి తమ అభ్యర్ధిగా సౌమ్య పుహాన్‌ను ఆ పార్టీ ప్రకటించింది.