Marathi Actor Ketaki Chitale: శరద్ పవార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మ‌ఠారీ నటిపై రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు కేసులు

By Rajesh KFirst Published May 14, 2022, 11:55 PM IST
Highlights

Marathi Actor Ketaki Chitale: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసినందుకు మరాఠీ నటి కేత్కీ చితాలేను థానే క్రైమ్ బ్రాంచ్ కస్టడీలోకి తీసుకుంది. ఆమెపై 3 కేసులు నమోదయ్యాయి. వీటిలో థానే నగరంలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఒకటి, పూణె, ముంబైలలో రెండు కేసులు నమోదయ్యాయి.
 

Marathi Actor Ketaki Chitale:  మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌పై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన మరాఠీ నటి కేత్కి చితాలేను థానే క్రైమ్ బ్రాంచ్ కస్టడీలోకి తీసుకుంది. ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. మరాఠీ నటి కేత్కి చితాలే ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. ‘నరకం ఎదురు చూస్తున్నది, బ్రాహ్మణ ద్వేషి’ అంటూ పలు అభ్యంతరకర పోస్టులు చేసింది. 

అయితే.. ఆ నటి మరాఠీలో చేసిన ఈ పోస్టుల్లో ఎక్క‌డ కూడా శరద్‌ పవార్ పేరు పూర్తిగా ప్రస్తావించలేదు. అయితే పవార్‌, 80 ఏళ్ల వ్యక్తి అని పరోక్షంగా ఆరోపించింది. దీంతో స్వప్నిల్ నెట్కే ఫిర్యాదుతో థానేలోని కాల్వా పోలీస్ స్టేషన్‌తోపాటు మరో రెండు పోలీస్‌ స్టేషన్లలో నటి కేత్కి చితాలేకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.     

శనివారం సాయంత్రం, నవీ ముంబైలోని కలంబోలి పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న చితాలేపై NCP మహిళా విభాగానికి చెందిన కార్యకర్తలు నల్ల ఇంక్, గుడ్లు విసిరారు. అంతకుముందు, ఆమెపై ప‌లు సెక్ష‌న్ల  కింద కేసు నమోదు చేశారు.  పూణెలో కూడా ఎన్సీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదైంది.
 
పోలీసుల సైబర్ విభాగం చితాలేపై ఐపిసి సెక్షన్లు 153 (ఎ), 500, మరియు 505 (2) కింద కేసు నమోదు చేసింది. అలాగే.. నటుడు నిఖిల్ భామ్రేతో పాటు కేత్కి చితాలేపై పూణేలో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ పోస్టుల‌పై మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్‌మెంట్ మంత్రి జితేంద్ర అవద్ తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.నటి పోస్ట్‌పై మహారాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100-200 పోలీస్ స్టేషన్లలో కేసులు న‌మోదు చేయాల‌ని పార్టీ కార్యకర్తలు ఆయ‌న పిలుపునిచ్చారు.  తమ నాయకుడిపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎన్సీపీ కుటుంబానికి పితృమూర్తి అని, ఆయనపై చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. 

మ‌రోవైపు.. ముంబై, పూణే, ఔరంగాబాద్‌లలో నటికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా జరిగాయి. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు నటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబై, పూణే మరియు ఔరంగాబాద్‌లలో న‌టి కేత్కి చితాలేకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు నటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ నటి ఇంతకుముందు కూడా వివాదాల్లో చిక్కుకుంది. కేత్కి చితాలే వివాదంలోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై ఓ కామెడీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ ద్వారా కేతికీ తన రక్షణ కోసం వచ్చి విమర్శకులకు సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కేత్కీ పోస్ట్‌ను సీనియర్ మరాఠీ నిర్మాత,  దర్శకుడు మహేష్ తిలేకర్ విమర్శించడంతో అభిమానుల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

న‌టి కేత్కి చితాలే కామెంట్స్ పై NCP చీఫ్ శ‌ర‌ద్ ప‌వ‌ర్ మాట్లాడుతూ - త‌న‌కు ఆ నటి ఎవరో తెలియదన్నారు. సంబంధిత పోస్ట్ కారణంగా  ఆమె పేరును విన్నాన‌ని చేప్పారు. కేత్కీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ నేతల నుంచి నిత్యం డిమాండ్‌ వస్తోంది. ఈ డిమాండ్ల దృష్ట్యా మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని తర్వాత, ఇప్పుడు థానే పోలీసులు నటి కేత్కి చితాలేపై చర్యలు తీసుకున్నారు.

click me!