పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో జర్నలిస్టు సోదరుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన మావోయిస్టులు..

Published : Oct 27, 2022, 12:11 PM ISTUpdated : Oct 27, 2022, 12:12 PM IST
పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో జర్నలిస్టు సోదరుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన మావోయిస్టులు..

సారాంశం

పోలీసులకు ఇన్‌ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో ఓ జర్నలిస్టు సోదరుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 

పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో ఓ జర్నలిస్టు సోదరుడిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు.

మాదకద్రవ్యాల రవాణా, దేశ భద్రతపై కేంద్ర‌మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని కోటపల్లి గ్రామంలో ‘జన్‌ అదాలత్‌’ (పీపుల్స్‌ కోర్టు లేదా కంగారూ కోర్టు) నిర్వహించిన అనంతరం బాధితుడు బసంత్‌ జాదీని మావోయిస్టులు శుక్రవారం కిడ్నాప్‌ చేశారు. అనంతరం దారుణంగా చంపేశారని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (బస్తర్‌ రేంజ్‌) సుందర్‌రాజ్‌ తెలిపారు.

పబ్లిసిటీ కోసమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆరాటం- ఆమ్ ఆద్మీ పార్టీ

మృతి చెందిన వ్యక్తి స్థానిక జర్నలిస్టు సోదరుడైన ఝాదీ అని ఆయన పేర్కొన్నారు. పోలీసు ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతోనే అతడిని హత్య చేశారని తెలిపారు. ‘‘ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బాధిత కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వారు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు’’ అని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు.

భార్య ఉరివేసుకుంటుంటే.. వీడియో తీస్తూ చోద్యం చూసిన భర్త.. అరెస్ట్..

కాగా.. ఈ ప్రాంతంలో మావోయిస్టులు తరచుగా ‘జన్ అదాలత్’ నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు విధేయులుగా ఉన్నారని అనుమానిస్తున్న వ్యక్తులను ఇలా దారుణంగా హత్య చేస్తున్నారు. గతంలో కూడా బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాలతో కూడిన దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్లనే అనుమానంతో ప్రజలను చంపిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?