పబ్లిసిటీ కోసమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆరాటం- ఆమ్ ఆద్మీ పార్టీ

Published : Oct 27, 2022, 11:22 AM IST
పబ్లిసిటీ కోసమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆరాటం- ఆమ్ ఆద్మీ పార్టీ

సారాంశం

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రతీ రోజు తన పేరు వార్తల్లో ఉండాలని అనుకుంటారని, ఛీప్ పబ్లిసిటీ కోసమే ఆయన ఆరాటపడుతుంటారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎల్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 

ఛత్ పూజ విషయంలో దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. ఛత్‌పై ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా విరుచుకుపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ తన కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తున్నారని పేర్కొంది.

భార్య ఉరివేసుకుంటుంటే.. వీడియో తీస్తూ చోద్యం చూసిన భర్త.. అరెస్ట్..

‘‘గౌరవనీయులైన సీఎం పై లెఫ్టినెంట్ గవర్నర్ వాడిన భాషపై మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ప్రతీ రోజూ సీఎంను బహిరంగంగా దూషించడం వల్ల ఆయన అధిరోహించిన కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తున్నారు. చారిత్రాత్మక మార్జిన్లతో వరుసగా మూడోసారి ప్రజాప్రతినిధిగా సీఎం ఎన్నికయ్యారు. ప్రతిరోజూ సీఎంను బహిరంగంగా మందలించే పని లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదు ’’ అని పేర్కొంది.

సక్సేనా చౌకబారు పబ్లిసిటీ కావాలని చూస్తున్నారని ఆప్ ఆరోపించింది. ప్రతిరోజూ ఆయన వార్తాపత్రికల్లో తన పేరు చూడాలని తాపత్రయ పడుతుంటారని పేర్కొంది. కాగా.. ఈ ఏడాది 1100 ఘాట్లలో చాత్ పూజను నిర్వహిస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీని కోసం చాత్ రోజున లక్షలాది మంది భక్తులు తమ ప్రార్థనలను చేయడానికి వీలుగా ప్రభుత్వం రూ. 25 కోట్ల బడ్జెట్ ను ఆమోదించింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క్లోరిన్ గ్యాస్ లీక్.. ఆస్ప‌త్రిపాలైన డ‌జ‌న్ల మంది

అయితే వాస్తవానికి కొన్ని రోజుల క్రితం అరవింద్ కేజ్రీవాల్.. యమునాలో ఎక్కడైనా ఛత్ మహాపర్వ్ చేయవచ్చని ట్వీట్ చేశారు. దీనికి లెఫ్టనెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఛత్ పూజను నిర్దేశించిన ఘాట్‌లలో అనుమతిస్తామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ చేసిన ప్రకటనను ఉద్దేశిస్తూ ఓ నోట్ విడుదల చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్.. యమునా నదిలోని అన్ని ఘాట్‌లలో ఛత్ పండుగను జరుపుకోవచ్చని అభిప్రాయన్ని సృష్టించిందని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదని పేర్కొన్నారు. ఇది ప్రజల్లో గందరగోళాన్నిసృష్టించవచ్చని ఆయన తెలిపారు. నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే పూజకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ ఇది చాలా సమస్యాత్మకమైనది. ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రణాళిక ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తుంది. ఈ అంశం ఇది చాలా మంది ప్రజల మత విశ్వాసాలు మరియు అభ్యాసాలకు సంబంధించినది.’’అని తెలిపారు.

సినీ నిర్మాతపై భార్య ఛీటింగ్ కేసు.. మరో మహిళతో ఉండడం చూసి, కారుతో గుద్ది...

కాగా.. ఈ ఏడాది మేలో సక్సేనా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి మధ్య అనేక విషయాల్లో వాగ్వాదం జరుగుతోంది. విద్యుత్ సబ్సిడీ పథకంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎల్‌జీ సక్సేనా ఇటీవల అక్టోబర్ 4న విచారణకు ఆదేశించారు. దీనిపై ఆప్ నేతలు స్పందిస్తూ..  ఎల్‌జీ ఎత్తుగడ గుజరాత్ ఎన్నికలకు సంబంధించినదని, ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని నిలిపివేయడమే దీని ఉద్దేశమని ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?