ఐఈడీ పేల్చిన మావోయిస్టులు: 11 మంది సైనికులకు తీవ్రగాయాలు

Siva Kodati |  
Published : May 28, 2019, 09:39 AM ISTUpdated : May 28, 2019, 10:20 AM IST
ఐఈడీ పేల్చిన మావోయిస్టులు: 11 మంది సైనికులకు తీవ్రగాయాలు

సారాంశం

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ దాడికి పాల్పడ్డారు.

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ దాడికి పాల్పడ్డారు. సరాయ్‌కెల్లాలోని కుచాయి అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కాన్వాయ్‌ వెళ్తుండగా కాపు కాసిన మావోలు ఐఈడీని పేల్చడంతో 11 మంది భద్రతా సిబ్బంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో 8 మంది కోబ్రా జవాన్లు, ముగ్గురు పోలీసులు ఉన్నారు. సైనికులను మరింత మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్‌లో రాంచీకి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Success Story : సర్కార్ సాయంతో చదివి.. యూపిఎస్సి ర్యాంక్ సాధించిన రైతు కూతురు
Trump Next Target: వెనెజులా ఫినిష్.. ట్రంప్ తరువాతి టార్గెట్ ఈ అందమైన దేశమే