ఓడిపోయామనే బాధలో.. తిండి, నీరు మానేసిన లాలు

By telugu teamFirst Published May 27, 2019, 4:31 PM IST
Highlights

లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామనే బాధలో ఆర్జేడే చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయారు

లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామనే బాధలో ఆర్జేడే చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయారు. ఈ క్రమంలోనే ఆయన రెండు రోజుల పాటు తిండి, నీరు తీసుకోవడం మానేశారు. దీంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 

ఆరోగ్యం మరింత విషమించకముందే ఆహారం తీసుకోమని వైద్యులు ఆయనను బ్రతిమిలాడటంతో సోమవారం ఆయన భోజనం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌ - ఆర్జేడీ కూటమిగా ఏర్పడి.. ఎన్డీఏను ఎదుర్కొని ఘోర పరాజయాన్ని చవి చూశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానానికే పరిమితం కాగా.. ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ.. 39 చోట్ల విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేసింది.
 

click me!