ఎన్‌కౌంటర్ బూటకం.. తగిన మూల్యం చెల్లించాల్సిందే: గడ్చిరోలి ఎదురుకాల్పులపై మావోల స్పందన

Siva Kodati |  
Published : Nov 14, 2021, 02:25 PM IST
ఎన్‌కౌంటర్ బూటకం.. తగిన మూల్యం చెల్లించాల్సిందే: గడ్చిరోలి ఎదురుకాల్పులపై మావోల స్పందన

సారాంశం

మహారాష్ట్రలోని గ్యారపట్టి ఎన్‌కౌంటర్‌పై స్పందించింది మావోయిస్ట్ పార్టీ. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మావోలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ బూటకమని.. పోలీసులే ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తోంది

మహారాష్ట్రలోని గ్యారపట్టి ఎన్‌కౌంటర్‌పై స్పందించింది మావోయిస్ట్ పార్టీ. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మావోలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ బూటకమని.. పోలీసులే ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తోంది. అమాయక ప్రజలకు డబ్బులు ఆశచూపి మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తున్నారని నక్సల్స్ ఆరోపిస్తున్నారు. మూడు రాష్ట్రాల సమన్వయంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని మావోలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, పోలీసులు ఎన్‌కౌంటర్‌లో సాయం చేసుకున్నారని మావోలు ఆరోపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని మావోయిస్టులు హెచ్చరించారు. 

కాగా.. మహారాష్ట్రలోని (maharashtra) గడ్చిరోలిలో (gadchiroli district) శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter) మావోయిస్టులకు (maoist) గట్టి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు మరణించిన మావోల సంఖ్య 26కి చేరింది. ధనోరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లుగా గడ్చిరోలి ఎస్పీ ప్రకటించారు. 

ALso Read:మహారాష్ట్ర: మావోయిస్ట్‌లకు భారీ దెబ్బ.. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 26కి చేరిన మృతులు

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. అనంతరం ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా జల్లెడ పడుతున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్