Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మాడ్‌ డివిజన్‌ కమిటీ కమాండ్ హ‌తం..   

Published : Aug 01, 2022, 03:08 PM IST
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మాడ్‌ డివిజన్‌ కమిటీ కమాండ్ హ‌తం..    

సారాంశం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని అటవీప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సల్ హతమయ్యాడని పోలీసులు తెలిపారు. హతమైన నక్సలైట్ ను మాడ్‌ డివిజన్‌ కమిటీ కమాండర్‌ హడ్మా అలియాస్‌ సంకుగా గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.  

Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మాలోని భెజ్జీ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసుల డీఆర్‌జీ బృందం నక్సలైట్లను ఎదుర్కొంది. డీఆర్‌జీ బృందంపై నక్సలైట్లు తొలుత కాల్పులు జరిపారని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో రివార్డ్ పొందిన నక్సలైట్‌ను హతమార్చినట్లు పోలీసులు ప్రకటించారు.

హతమైన నక్సలైట్ ను మాడ్‌ డివిజన్‌ కమిటీ కమాండర్‌ హడ్మా అలియాస్‌ సంకుగా గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగితున్నాయ‌ని వెల్లడించారు. ఎన్‌కౌంటర్ లో ఓ నక్సలైట్ మరణాన్ని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..  సోమ‌వారం ఉదయం 6 గంటలకు భేజ్జీ ప్రాంతంలోని పటేల్‌పారా, బంకుపరా సమీపంలో నక్సలైట్లకు డిఆర్‌జి జవాన్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఒక నక్సల్ మరణించగా, మరికొందరు నక్సలైట్లు గాయ‌ప‌డ్డారు. డీఆర్‌జీ బృందం ఆ ప్రాంతంలో సోదాలు చేస్తోంది. ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్లు గాయ‌ప‌డిన‌ట్టు చెబుతున్నారు. ప‌రిశోధన బృందం నుండి తిరిగి వచ్చిన తర్వాత అసలు స్థానం తెలుస్తుంది.

నక్సలైట్లు అమరవీరుల వారోత్సవాలు

నక్సలైట్లు అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్న‌ట్టు స‌మాచారం. అమరవీరుల వారోత్సవాలలో భారీ సంఖ్య‌లో నక్సలైట్లు పాల్గొనే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా.. ఈ రోజు DRG బృందం భెజ్జీ ప్రాంతంలో శోధనలు నిర్వ‌హించింది. సెర్చ్ టీమ్ రావడం చూసి నక్సలైట్లు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెబుతున్నారు. దీనికి ప్రతీకారంగా ఓ నక్సలైట్‌ని హతమార్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, గత పదిరోజుల వ్యవధిలో సుక్మా జిల్లా పరిధిలో కాల్పులు చోటుచేసుకోవడం ఇది మూడోసారి. ఈ మూడు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు న‌క్స‌ల్స్ మృతి చెందార‌ని పోలీసులు తెలిపారు.  జులై 29న సుక్మా జిల్లా పరిధిలోని బింద్రపాణి గ్రామంలో, పల్బగాడి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

PREV
click me!

Recommended Stories

Jio Recharge Plans : కేవలం రూ.11 కే 10GB,రూ.49 కే 25GB హైస్పీడ్ డేటా
Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu