కూరగాయలు అమ్మిన కోతి... ఈ విచిత్రం ఎక్కడైనా చూశారా..?

Published : Jan 22, 2022, 09:43 AM IST
కూరగాయలు అమ్మిన కోతి... ఈ విచిత్రం ఎక్కడైనా చూశారా..?

సారాంశం

అది నిజంగా అమ్మలేదు లేండి.. అలా బిల్డప్ ఇచ్చి.. తర్వాత తన కోతి బుద్ది చూపించి.. కూరగాయలన్నింటినీ తినేసింది. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


చిరు వ్యాపారులు కూరగాయలు అమ్మడం చాలా సహజం. ఆ కూరగాయల మార్కెట్లోకి దూరి.. కూరగాయలను కోతులు ఎత్తుకెళ్లడం కూడా మీరు చాలా సార్లు చూసే ఉంటారు. కానీ.. ఓ కోతి.. వ్యాపారి మాదిరి కూర్చొని కూరగాయలు అమ్మడం ఎప్పుడైనా చూశారా..? మధ్యప్రదేశ్ లో అదే జరిగింది. అయితే.. అది నిజంగా అమ్మలేదు లేండి.. అలా బిల్డప్ ఇచ్చి.. తర్వాత తన కోతి బుద్ది చూపించి.. కూరగాయలన్నింటినీ తినేసింది. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే.... మధ్యప్రదేశ్‌లోని ఒక కూరగాయాల దుకాణంలోకి కోతి చొరబడింది. కూరగాయలమ్ముకునే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కోతి అతని స్థానంలోకి వచ్చి కుర్చొంది. దుకాణదారుడి మాదిరిగా కూరగాయాలు అమ్ముతున్న‍ట్లుగా నటిస్తూనే కూరగాయలను తినేసింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైన సరే కోతి కూరగాయాల దుకాణం నడుపుతుందని అనుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది. కాగా మా దగ్గర విపరీతమైన కోతుల బెడద ఉందని.. అవి ఇలా దుకాణంలోకి చొరబడి వస్తువులను పాడుచేయడం లేదా ఎత్తుకుపోవడం చేస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే